Share News

kumaram bheem asifabad- అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jul 30 , 2026 | 11:03 PM

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అన్నారు. గురువారం హైదరాబాద్‌ నుంచి డీజీపీ సీవీ ఆనంద్‌, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖ అధికారులతో వర్ష పరిస్థితులు, రక్షణ చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- అధికారులు అప్రమత్తంగా ఉండాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ హరిత, ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, ఎం డేవిడ్‌

ఆసిఫాబాద్‌, జూలై 30 (ఆంఽధ్రజ్యోతి): భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అన్నారు. గురువారం హైదరాబాద్‌ నుంచి డీజీపీ సీవీ ఆనంద్‌, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖ అధికారులతో వర్ష పరిస్థితులు, రక్షణ చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి మాట్లా డుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వర్ష పరిస్థితుల నేపథ్యంలో జిల్లా స్థాయిలో 24 గంటల పాటు పని చేసే కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసి పరిశీలించాలన్నారు. రాష్ట్ర విపత్తు స్పందన దళం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మోహరించి అప్రమత్తంగా ఉంచామన్నారు. అలాగే పాతభవనాలను గుర్తించి అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కె.హరిత, ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, ఎం డేవిడ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 11:03 PM