Share News

kumaram bheem asifabad- అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jul 28 , 2026 | 11:07 PM

జిల్లాలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడు అవకాశం ఉందనే వాతావరణశాఖ హెచ్చరిక నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మంగళవారం జిల్లా అధికారులు పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, విద్యుత్‌, నీటిపారుదల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్షించారు

kumaram bheem asifabad- అధికారులు అప్రమత్తంగా ఉండాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడు అవకాశం ఉందనే వాతావరణశాఖ హెచ్చరిక నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మంగళవారం జిల్లా అధికారులు పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, విద్యుత్‌, నీటిపారుదల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్షించారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రాణహిత నదికి వరద వచ్చే అవకాశం ఉందని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. వాగులు, వంతెనల వద్ద సిబ్బందితో నిఘా ఏర్పాటు చేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చుడాలని చెప్పారు. సహాయక చర్యల్లో భాగంగా కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూంను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇబ్బందులు ఎదురైతే 8500844365కు సమాచారం అందించాలన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను రెండురోజుల్లోగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.

అర్హులకు పింఛన్‌ అందేలా చర్యలు

తెలంగాణ జీవానోపాదుల పథకం కింద అర్హులైన గిరిజనులకు పింఛన్‌ అందేలాచర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం తెలంగాణ జీవానోపాదుల ప్రాజక్టు కింద జిల్లాలోని తిర్యాణి, లింగాపూర్‌ మండలాల్లో ఎంపికైన గ్రామాలలోని అర్హులైన గిరిజనులకు పింఛను మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ పథకం కింద అర్హులైన గిరిజనులకు 100 శాతం పింఛన్లు, జాబ్‌కార్డులు, ఆధార్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు అందించనున్నామని తెలిపారు. గిరిజనలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, డీఆర్‌డీవో దత్తారావు, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతిగౌడ్‌, డీపీఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2026 | 11:07 PM