Share News

ఫారెస్టు విస్తరణ పనులను పరిశీలించిన అదికారులు

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:02 AM

ఆర్‌కేపీ ఫేజ్‌-2 విస్తరణ పనులను శుక్రవారం రాష్ట్ర అటవిశాఖ అధికారులు పరిశీ లించారు. సింగరేణి విస్తరించిన అటవిప్రాంతానికి బదులుగా అను కూలంగా ఉండే అటవి పెంపకాల గురించి స్థలాలని అధికారులు పరిశీలించారు.

ఫారెస్టు విస్తరణ పనులను పరిశీలించిన అదికారులు
సింగరేణి అటవి పరిసరాలను పరిశీలించిన అధికారులు

రామకృష్ణాపూర్‌, ఫిబ్రవరి13 (ఆంధ్రజ్యోతి): ఆర్‌కేపీ ఫేజ్‌-2 విస్తరణ పనులను శుక్రవారం రాష్ట్ర అటవిశాఖ అధికారులు పరిశీ లించారు. సింగరేణి విస్తరించిన అటవిప్రాంతానికి బదులుగా అను కూలంగా ఉండే అటవి పెంపకాల గురించి స్థలాలని అధికారులు పరిశీలించారు. రాష్ట్ర అటవిశాఖచీఫ్‌ కన్జర్వేటర్‌ శరవనన్‌, డిప్యూటి కన్జర్వేటర్‌ సంగీత, కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు శాంతారాం, మంచి ర్యాల జిల్లా అటవిశాఖ అధికారి ఆశిస్‌సింగ్‌లు పరిశీలించారు. భూ విస్తిర్ణం, నీటి లభ్యత, భవిష్యత్‌ అటవి అభివృద్ధి అవకాశాలను అధికారుల బృందం మందమర్రి జీఎం రాధాక్రిష్ణ, శ్రీరాంపూర్‌ జీ ఎం శ్రీనివాస్‌లకు వివరించారు. మాజీ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ మోహన్‌చంద్ర సింగరేణి ఎస్టేడ్‌జనరల్‌ మేనేజర్‌ లక్ష్మిపతిగౌడ్‌, అటవిశాఖకు అనుకూలతలపై వారి అభిప్రాయాలను వెల్లడించా రు. పర్యావరణ నిబందనలు పాటిస్తూ ఓసీ డంపింగ్‌యార్డులను పనులను చేపట్టాలన్నారు. అధికారుల వెంట ఎస్‌ఓటు జీఎం ప్ర సాద్‌, డీజీఎం సర్వే దేశాయ్‌, ఫారెస్టు అధికారి నవీన్‌, సింగరేణి ఎస్టేట్‌ ఆఫీసర్‌ నవనీత, జూనియర్‌సర్వే ఆఫీసర్‌ నరేశ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 12:02 AM