Share News

ఈనెల 9వరకు అభ్యంతరాలు తెలపాలి

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:43 PM

ఓటరు జాబి తాలో ఏమైనా అభ్యంతరా లు ఉంటే ఈ నెల 9వ తేదీ లోపు చెప్పాలని కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌ సూచించారు.

ఈనెల 9వరకు అభ్యంతరాలు తెలపాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

నాగర్‌కర్నూల్‌, జనవరి6 (ఆంధ్రజ్యోతి) : ఓటరు జాబి తాలో ఏమైనా అభ్యంతరా లు ఉంటే ఈ నెల 9వ తేదీ లోపు చెప్పాలని కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌ సూచించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరం లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయ కులతో మం గళవారం ఓటరు జాబితా సవర ణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏమై నా అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ నెల 9వ తేదీ నాటికి అధికారు లకు తెలియజే యాలని, తుది జాబితా 10న విడుదల చేస్తారని తెలిపారు. ఈ సమావే శంలో అదనపు కలెక్టర్‌ దేవసహాయం, ముని సిపల్‌ కమిషనర్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

హెచ్‌ఎంల డైరీ ఆవిష్కరణ

నాగర్‌కర్నూల్‌, (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యను బలోపేతం చేయ డంలో గెజిటెడ్‌ హెచ్‌ఎంల పాత్ర కీలకమని, పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రధానోపాధ్యాయులు కృషి చేయా లని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. తెలం గాణ రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం 2026 సంవత్సరం డైరీని జిల్లా అధ్యక్షుడు జే.శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిరంజీవి, వెంక టరమణలతో కలిసి కలెక్టర్‌ మంగళవారం ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు జే.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిరం జీవి, వెంకటరమణ, కోశాధికారి తిరుపతయ్య, నరహరి, శ్రీనివాస్‌, మూర్తి, రాజశేఖర్‌రావు, బషీర్‌ అహ్మద్‌, సత్యనారాయణశెట్టి, ఝాన్సీరా ణి, ప్రసన్న, అర్జునయ్య, రహీమ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 11:43 PM