kumaram bheem asifabad- 9వ తేదీ లోగా అభ్యంతరాలు తెలియజేయాలి
ABN , Publish Date - Jan 06 , 2026 | 10:16 PM
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా వార్డుల వారిగా ఓటరు జాబితాపై ఈ నెల 9వ తేదీ లోగా అభ్యంతరాలు తెలియజేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి మున్సిపల్ ఎన్నికల భాగంగా మంగళవారం ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల ప్రదేశాల విషయంలో అభ్యంతరాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా వార్డుల వారిగా ఓటరు జాబితాపై ఈ నెల 9వ తేదీ లోగా అభ్యంతరాలు తెలియజేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి మున్సిపల్ ఎన్నికల భాగంగా మంగళవారం ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల ప్రదేశాల విషయంలో అభ్యంతరాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలకు సంబందించిన ముసాయిదా ఓటరు జాబితా పరకటించడం జరిగిందని, జాబితాలో పొందు పరిచిన వివరాలను పరతి ఓటరు పరిశీలించుకోవాలని తెలిపారు. జాబితాలో పేర్లపై ఏమైన అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 9వ తేదీ లోగా రాత పూర్వకంగా సమర్పించాలని తెలిపారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 13905 మంది ఓటర్లు ఉండగా 24 పోలింగ్ కేంద్రాలు, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 51,025 మంది ఓటర్లు ఉండగా 83 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఏ వార్డులో ఉన్న ఓటరు అదే వార్డులో ఉండేలా వార్డు అధికారులు, బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించడం జరుగుతుందని, రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల ప్రకారం ఈ నెల 10వ తేదీన తుది ఓట రు జాబితాను ప్రకటించనున్నామని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి ఏజెంట్లు, ఓటరు జాబితాపై సహకరించాలని, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల ప్రాంతాలపై అభ్యంతరాలు ఉన్నట్లయితే వెంటనే సమర్పించాలని అన్నారు. ఎన్నికల కమీషన నిబంధనలు పాటించాలని తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టి పోల్ యాప్‌లో వార్డుల వారీగా ఓటరు జాబితా పరిశీలించుకోవచ్చని ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే వార్డులో ఉండే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు దృషిటకి తీసుకు రావాలన్నారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్‌స్థాయి ఏజెంట్లు సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు గజానన్, రాజేందర్, టీపీఓ యశ్వంత్, నాయకులు, సంబంధిత అదికారులు పాల్గొన్నారు.