Share News

జనగణనలో ఓబీసీ కాలమ్‌ ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Oct 25 , 2026 | 11:20 PM

కేంద్ర ప్రభుత్వం చేప ట్టిన జనగణనలో ప్రతీ కుల జనాభాను కచ్చితంగా నమోదు చేయడంతో పాటు, బీసీలకు ప్రత్యేక ఓబీసీ కాలమ్‌ ఏర్పాటు చేయాలని బీసీ కుల సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు.

జనగణనలో ఓబీసీ కాలమ్‌ ఏర్పాటు చేయాలి
జిల్లా కేంద్రంలో రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న కుల సంఘాల నాయకులు

- రౌండ్‌టేబుల్‌ సమావేశంలో బీసీ కుల సంఘాల నాయకుల డిమాండ్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం చేప ట్టిన జనగణనలో ప్రతీ కుల జనాభాను కచ్చితంగా నమోదు చేయడంతో పాటు, బీసీలకు ప్రత్యేక ఓబీసీ కాలమ్‌ ఏర్పాటు చేయాలని బీసీ కుల సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని వీరభద్రయ్య క మ్యూనిటీ హాలులో మహాత్మజ్యోతిబాఫూలే చారి టబుల్‌ ట్రస్టు వ్యవస్ధాపకుడు పచ్చిపాల సుబ్బ య్య ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల రౌండ్‌టే బుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రతీ కులాన్ని స్పష్టంగా గుర్తించేందుకు జనగ ణనలో ప్రత్యేక డ్రాప్‌డౌన్‌ మెనూ ఏర్పాటు చేసి, ప్రతీ కులానికి ప్రామాణిక యూనిక్‌ కోడ్‌ కేటాయించాలని కోరారు. కులగణన పారద్శ కంగా, కచ్చితంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ సీనియర్‌ నాయ కులు అక్కల బాబుగౌడ్‌, దాసర్ల వెంకటస్వామి, జిల్లా కన్వీనర్‌ శివశంకర్‌యాదవ్‌, కోకన్వీనర్‌ కుంభం మల్లేష్‌గౌడ్‌, సంజీవ్‌గౌడ్‌, వ్యాస వెంక టేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2026 | 11:20 PM