Share News

kumaram bheem asifabad-పోషణ.. ఆరోగ్యానికి బాసట

ABN , Publish Date - Sep 29 , 2026 | 10:54 PM

ఆరోగ్యకరమైన సమాజానికి పౌష్టికా హారమే పునాది. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సమయానికి ఆహారం అందించడంతో పాటు రక్తహీనతను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఐసీడిఎస్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

kumaram bheem asifabad-పోషణ.. ఆరోగ్యానికి బాసట
లోగో

- అక్టోబరు 8 వరకు కార్యక్రమాలు

కాగజ్‌నగర్‌ టౌన్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యకరమైన సమాజానికి పౌష్టికా హారమే పునాది. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సమయానికి ఆహారం అందించడంతో పాటు రక్తహీనతను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఐసీడిఎస్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈనెల 9 నుంచి అక్టోబరు 8 వరకు అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో వివిధ అవగాహణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 5 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1,006 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా 45 వేలకు పైగా చిన్నారులకు 2,575 మంది బాలింతలకు, 5,500 మంది గర్భిణులకు సేవలు అందుతున్నాయి. పోషకాహార ప్రాధాన్యత, రక్తహీనత నివారణ, పరిశుభ్ర-పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు.

పోషక విలువలు గల..

పోషక విలువలు గల ఆహారం తీసుకోవాలని సిబ్బంది సూచిస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయ లు, చిరు ధాన్యలు, పండ్లు, గుడ్లు, తదితర పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకునేలా సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండే ఆకు కూరలైన చుక్కకూర, గునుకు, పాలకూర, తుమ్మికూర ఇతరత్ర వాటిల్లోని పోషక విలువలు కూడా వివరిస్తున్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వీటిని వంటల్లో బాగం చేసుకునేలా వివరిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా కాలనీలు, ఇళ్ల్లతో పాటు, అంగన్‌ వాడీ సెంటర్లలో అవగాహన కల్పిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల బరువు, ఎత్తు నమోదు చేస్తూ, పోషకాహార లోపం ఉన్న వారిని గుర్తిస్తున్నారు. పోషకాహార లోపంతో ఇబ్బందులుంటే వారికి హిమోగ్లోబిన్‌ శాతం పెంచడం, చిన్నారుల్లో ఆరోగ్యాన్ని పెంపొందించడం వంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మాతా శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశంగా పోషణ మాసోత్సవాలు కొనసాగిస్తున్నారు. చిన్నారుల శారీరక, మానసిక అభివృద్ధికి మొదటి వెయ్యి రోజులు కీలకమని చెబుతున్నారు. అధిక పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్రాను. రక్తహీనత నివారణ, పరిశుభ్రత, పారిశుధ్యం, విరేచనాల నియంత్రణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు.

పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నాం..

- మాచర్ల వినోద, అంగన్‌వాడీ టీచర్‌

అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నిత్యం అవగాహన కల్పిస్తు న్నాం. ప్రతీ రోజు ఒక్కో కార్యక్రమం నిర్వహి స్తు న్నాం. ఆరోగ్య సూత్రాలను పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నాం. పౌష్టికాహారం అందిస్తు న్నాం. నెల రోజుల పాటు మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. ప్రతీ రోజు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

Updated Date - Sep 29 , 2026 | 10:54 PM