ఎన్టీఆర్ ఏది చేసినా సంచలనమే
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:44 AM
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే అని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు.
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు
ఎన్టీఆర్‌భవన్‌లో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
హైదరాబాద్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే అని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకురావడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు ఎన్టీఆర్ హయాంలోనే జరిగాయని ఆయన గుర్తుచేశారు. నేడు కేంద్రం చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ప్రతిపాదించడానికి ఆయన ఆలోచనా విధానమే స్ఫూర్తి అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌భవన్‌లో పార్టీ జాతీయ అఽధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగిన టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు.. జూమ్ కాన్ఫరెన్సు ద్వారా పార్టీ నాయకులనుద్దేశించి ప్రసంగించారు. దళితుల కోసం ఎన్టీఆర్ ప్రారంభించిన ఆశ్రమ పాఠశాలలు అద్భుతమని బక్కని నర్సింహులు పేర్కొన్నారు. నమ్ముకున్న కార్యకర్తలనే నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ టీడీపీయేనని నన్నూరి నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు.