kumaram bheem asifabad-తనిఖీలు అంతంతే..
ABN , Publish Date - Aug 16 , 2026 | 11:29 PM
భారీ లోడ్‌తో ప్రమాదకరంగా దూసుకెళ్లే లారీలు, టిప్పర్లు, ఇతర సరుకు రవాణా వాహనాల కట్టడికి అధికారుల తనిఖీలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. పరిమితికి మంచి సరుకులు తరలిస్తున్న ఓవర్ లోడ్ లారీలతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రతి రోజు యథేచ్ఛగా ఓవర్ లోడ్ రవాణా సాగుతున్నప్పటికీ సంబంఽధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణు న్నాయి.
- నిబంధనలు గాలికొదిలి యఽథేచ్ఛగా రాకపోకలు
- మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి అధిక బరువుతో ముడిసరుకు రవాణా
కాగజ్‌నగర్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): భారీ లోడ్‌తో ప్రమాదకరంగా దూసుకెళ్లే లారీలు, టిప్పర్లు, ఇతర సరుకు రవాణా వాహనాల కట్టడికి అధికారుల తనిఖీలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. పరిమితికి మంచి సరుకులు తరలిస్తున్న ఓవర్ లోడ్ లారీలతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రతి రోజు యథేచ్ఛగా ఓవర్ లోడ్ రవాణా సాగుతున్నప్పటికీ సంబంఽధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణు న్నాయి. రోడ్డు రవాణా నిబంఽధనల ప్రకారం వాహనాల నిర్ధేశిత బరువు సామర్థ్యానికి మించి సరుకులు రవాణా చేయడం నిషేధం. ఓవర్ లోడ్ కారణంగా వాహనాల నియంత్రణ కోల్పోయే ప్రమాదంతో పాటు బ్రేకింగ్ సామర్థ్యం తగ్గడం, రోడ్లు దెబ్బతినటం, ప్రమా దాల ముప్పు పెరగడం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా లారీ నుంచి సరుకులు రోడ్డుపై పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండడంతో ఇతర వాహన దారులకు ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మాకొడి మీదుగా సిర్పూరు(టి), కాగజ్‌నగర్ మీదుగా హైదరాబాద్‌కు వివిధ కంపెనీలకు ముడిసరు కును లారీల్లో తీసుకొస్తున్నారు. దూర ప్రాంతాలకు గిట్టుబాటు కాదని ఓవర్ లోడ్‌తో తీసుకొచ్చి సొమ్ము చేసుకుంటు న్నారు.
- రాత్రి వేళల్లో..
రాత్రి వేళల్లో వంద నుంచి రెండు వందల వరకు లారీలతో ఈ దందాను కొనసాగిసు ్తన్నారు. వేగంగా దూసుకొచ్చే భారీ లారీలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందనని స్థానికులు బిక్కు బిక్కుమంటు కాలం గడుపు తున్నారు. వాస్తవంగా 14 టైర్ల లారీలో 30 టన్నులు, 16 టైర్ల లారీలో 35 టన్నులు, 18 టైర్ల లారీలో 40 టన్నుల లోడ్ తీసుకెళ్లాల్సి ఉండగా, దీనికి అదనంగా 20 నుంచి 30 ట న్నుల లోడ్‌ను తీసుకెళ్లుతున్నారు. ముఖ్యంగా మోటర్ వెహికిల్ యాక్టు, 1988లోని సెక్షన్ 194(1) ప్రకారం అనుమతించిన బరువుకు మంచి వాహనం నడిపితే రూ.20వేల నుంచి అదనపు టన్ను ఓవర్ లోడ్‌కు రూ.2వేల వర కు చెల్లించాల్సి ఉంటుంది. అదనపు లోడ్‌ను తొలగించే వరకు వాహనాన్ని ముందుకు వెళ్లనీయకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మాకొడి మీదుగా నిత్యం రవాణా అవుతున్న అధిక లోడ్ వాహనాలపై రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ దందాకు పూర్తి స్థాయిలు బ్రేక్‌లు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో సిర్పూరు(టి)లో రోడ్డుపై గ్రామస్తులు ధర్నా చేపట్టగా, అధికారులు హడావుడి చేసి చేతులు దులుపుకున్నారు. మళ్లీ ఇదే విధంగా లారీలు రాకపోకలు సాగి స్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై ఆర్టీవో వెంకట్‌రాంరెడ్డిని వివ రణ కోరగా అధిక లోడ్‌తో వెళ్లిన వాహనా లపై నిబంధనల ప్రకారం చర్యలు తీసు కుంటామన్నారు. ప్రతీరోజు తాము తనిఖీలు చేస్తున్నామని తెలిపారు.