గుండు చేయించుకుంటే.. గుర్తించలేదు
ABN , Publish Date - May 29 , 2026 | 03:21 AM
ఉపాధి హామీ పథకంలో కొత్తగా తీసుకువచ్చిన ముఖ గుర్తింపు హాజరు విధానం వల్ల కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ కూలీ గుండు చేపించుకుని ఉపాధి....
ముఖ గుర్తింపు హాజరు విధానంతో ఉపాధి కూలీ ఇక్కట్లు
ఇనుగుర్తి, మే 28 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో కొత్తగా తీసుకువచ్చిన ముఖ గుర్తింపు హాజరు విధానం వల్ల కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ కూలీ గుండు చేపించుకుని ఉపాధి పనులకు వెళ్లగా.. మొబైల్ సాఫ్ట్‌వేర్ యాప్ అతడి ముఖాన్ని గుర్తించకపోవడంతో అతడు తంటాలు పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీ మల్యాల శ్రీను రెండు రోజుల క్రితం కొండగట్టు అంజన్నస్వామిని దర్శించుకొని, తలనీలాలు సమర్పించాడు. అనంతరం గురువారం అతడు ఉపాధి పనులకు వెళ్లగా.. హాజరు సమయంలో నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్ అతడి ముఖాన్ని గుర్తించలేదు. దీంతో గడ్డానికి నల్లని బొగ్గు, తలపై వెంట్రుకలు ఉన్నట్లు ఓ మహిళ జుట్టును పెట్టుకోగా యాప్ గుర్తించింది. దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్‌గా మారింది.