Share News

kumaram bheem asifabad- ఇక మండల స్థాయిలోనూ ‘ప్రజావాణి’

ABN , Publish Date - Aug 07 , 2026 | 10:59 PM

ఇకపై మండల స్థాయిలోనూ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని విస్తరించనుంది. ఇప్పటి వరకు ప్రతి జిల్లాలో కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తు న్నారు. కాగా దీంతో పాటు ప్రతి మండల కేంద్రాల్లో సైతం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నా రు.

kumaram bheem asifabad- ఇక మండల స్థాయిలోనూ ‘ప్రజావాణి’
లోగో

- నోడల్‌ అధికారులుగా ఎంపీడీవోలు

చింతలమానేపల్లి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఇకపై మండల స్థాయిలోనూ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని విస్తరించనుంది. ఇప్పటి వరకు ప్రతి జిల్లాలో కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తు న్నారు. కాగా దీంతో పాటు ప్రతి మండల కేంద్రాల్లో సైతం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నా రు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబరు 3 జారీ చేసింది. ప్రతీ మండల పరిషత్‌ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎంపీ డీవో కార్యాలయాల్లో ఈ నెల నుంచి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఎంపీడీవోల పర్యవేక్షణలో కొనసాగనుంది. నోడల్‌ ఆఫీసర్‌ ఎంపీడీవోను నియమించారు. ప్రతీ సోమవారం ఉదయం పది గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. హార్టికల్చర్‌, వ్యవసాయాధి కారి, వెటర్నరీ అధికారి, సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి, హౌసింగ్‌ అధికారి, ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ, ఆర్‌ అండ్‌ బి ఏఈ, ఫారెస్టు, విద్యుత్‌ శాఖ అధికారులు ఈ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనున్నారు.

- పెండింగ్‌ సమస్యలు..

గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలు, దీర్ఘకాలి కంగా పరిష్కారం కాని సమస్యలు కలెక్టరేట్‌ వెళ్లడా నికి దూర భారంగా ఉన్న వారికి ఈ మండల ప్రజావాణి ఎంతగానో ఉపయోగపడనుంది. జల్లా కలెక్టర్‌ నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా లోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంతో వ్యయ, ప్రయాసాలకొర్చి వస్తున్నారు. దాంతో సమయం, డబ్బు, వృధా కానుంది. ఈ ప్రజావాణి కార్యక్ర మంలో తమ సమీపంలోని మండల కార్యాలయానికి వచ్చి తమ సమస్యకు పరిష్కారం పొందనున్నారు. జిల్లా మండల స్థాయిలో నిర్వహించే ప్రజవాణి కార్యక్రమం ఒకే వేదికపై ప్రభుత్వ శాఖల అధికారులు అందరు ఉండి గ్రామీణ స్థాయి ప్రజల సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. వచ్చిన ప్రతీ దరఖాస్తుకు అధికారులు జవాబుదారితనంగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కల్పిస్తున్నారు. వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రజావాణి పోర్టల్లో నమోదు చేసి ప్రత్యేకగ్రీవెన్స్‌ ఐడీతో కూడిన రశీదును ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడికి ఇచ్చిన ఐడీ నంబరు ఆధారంగా ఫిర్యాదు ఏ స్థాయిలో ఉంది, ఏ అధికారి దగ్గర పెండింగ్‌లో ఉందో ఇక తేలనుంది. త్వరగా సమస్యలను కూడా పరిష్కారించాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను ఉన్నత స్థాయి అధికారులు కూడా పరిశీలిస్తారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీ లుండగా, రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్‌కు దరఖాస్తులు సమర్పించే వారు. మండల కార్యాలయాన్ని ప్రజావా ణి కార్యక్రమం నిర్వహించడం పట్ల ప్రజలకు మరిం త సేవల దగ్గరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Updated Date - Aug 07 , 2026 | 10:59 PM