Share News

నోటీసులు అందించాలి

ABN , Publish Date - Sep 10 , 2026 | 11:04 PM

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో సందేహాలు ఉన్న ఓటర్లకు వచ్చిన నోటీసులను త్వరతగతిన అందించాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. లక్షెట్టిపేట మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీని కలెక్టర్‌ గురువారం పరిశీలించారు.

నోటీసులు అందించాలి
మిట్టపెల్లిలో నోటీసులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌దీపక్‌

లక్షెట్టిపేట, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో సందేహాలు ఉన్న ఓటర్లకు వచ్చిన నోటీసులను త్వరతగతిన అందించాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. లక్షెట్టిపేట మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీని కలెక్టర్‌ గురువారం పరిశీలించారు. ఈసందర్శంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని రెండు రోజుల్లో వచ్చిన నోటీసులను ఓటర్లకు తప్పకుండా బీఎల్‌వోలు అందజేయాలన్నారు. నోటీసులు తీసుకున్న వారు ఎస్‌ఐఆర్‌ ఫారంలో తప్పును సవరించేందుకు నోటీసు వెనుకాల ఇచ్చిన గుర్తింపు కార్డులను కూడా త్వరగా అందించాలని లేని పక్షంలో ఓటరు లిస్టులో నుంచి పేరు తొలగించబడుతుందన్నారు. అదే విధంగా మిట్టపల్లి గ్రామంలోని ప్రభుత్వం అందజేస్తున్న చేయూత పెన్షన్‌ వెరిఫికేషన్‌ను పరిశీలించారు. లబ్దిదారులందరికి చేయూత పెన్షన్‌ అందించా లన్నారు. ఈకార్యక్రమంలో కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ దిలీప్‌కుమార్‌, ఎంపీ డీవో మధుసుధన్‌, గ్రామ సర్పంచ్‌ చాతరాసి బానేష్‌ ఉన్నారు.

Updated Date - Sep 10 , 2026 | 11:04 PM