kumaram bheem asifabad- నాన్ మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు జారీ చేయాలి
ABN , Publish Date - Aug 20 , 2026 | 10:43 PM
సర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, సూపర్‌వైజర్లతో జూం మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మ్యాపింగ్ కానీ ఓటర్లు 20,929 మంది ఉన్నారని చెప్పారు. వారందరికి నిర్ణీత గడువులోగా నోటీసులు అందించాలన్నారు. వారి నుంచి ఎన్నికల సంఘం పేర్కొన్న ఆధారాలను స్వీకరించాలని సూచించారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): సర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, సూపర్‌వైజర్లతో జూం మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మ్యాపింగ్ కానీ ఓటర్లు 20,929 మంది ఉన్నారని చెప్పారు. వారందరికి నిర్ణీత గడువులోగా నోటీసులు అందించాలన్నారు. వారి నుంచి ఎన్నికల సంఘం పేర్కొన్న ఆధారాలను స్వీకరించాలని సూచించారు. నోటీసులను ముందుగానే అందించి కొంత గడువు ఇవ్వాలని చెప్పారు. అక్టోబరు 5వ తేదీలోగా నాన్ మ్యాపింగ్ ఓటర్ల హియరింగ్ పూర్తి చేయాలని తెలిపారు. జాబితాలో గల ఓటర్లలో పేరు, తండ్రిపేరు, వయస్సు వంటి వ్యత్యాసాలను బూత్ స్థాయి అధికారుల లాగిన్ తహసీల్దార్ లాగిన్‌లలో విచారించి చిన్నచిన్న వ్యత్యాసాలను సవరించవచ్చని చెప్పారు. తద్వార అనామలిస్ జాబితాలో గల ఓటర్లను తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాలను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం త్వర గా పూర్తి చేసేల చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవోలు లోకేశ్వర్‌రావు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లుకు ఏర్పాట్లు చేయాలి
జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులతో గురువారం ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 23,934 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకు గాను కొనుగోలు కేంద్రాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని సూచించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా స్థలాలనుగుర్తించాలని గోనే సంచుల లభ్యత తూకం తేమ యంత్రాలు, టార్ఫాలిన్ కవర్లు అవసరమున్న మేరకు ప్రభుత్వానికి ఇండెంట్ సమర్పించాలని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేయలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, ఆర్డీవో కృష్ణయ్య, సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.