Share News

kumaram bheem asifabad- ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కుట్రతోనే నోటీసులు

ABN , Publish Date - Nov 15 , 2026 | 10:42 PM

సర్‌సిల్క్‌ భూముల్లో నివాసం ఉంటున్న కార్మికులు, కార్మికేతరలకు నోటీసుల వ్యవహారం కేవలం ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ, దండే విఠల్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌ బాబు కుట్రతోనే ఈ తతంగం జరిగినట్టు మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి అన్నారు. కాగజ్‌నగర్‌ సర్‌సిల్క్‌ పార్క్‌లైన్‌లో ఆదివారం నోటీసు బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఈ భూములను లాక్కొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

kumaram bheem asifabad- ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కుట్రతోనే నోటీసులు
మాట్లాడుతున్న మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

కాగజ్‌నగర్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): సర్‌సిల్క్‌ భూముల్లో నివాసం ఉంటున్న కార్మికులు, కార్మికేతరలకు నోటీసుల వ్యవహారం కేవలం ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ, దండే విఠల్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌ బాబు కుట్రతోనే ఈ తతంగం జరిగినట్టు మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి అన్నారు. కాగజ్‌నగర్‌ సర్‌సిల్క్‌ పార్క్‌లైన్‌లో ఆదివారం నోటీసు బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఈ భూములను లాక్కొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాగజ్‌నగర్‌లో గత 60 సంవత్సరాల నుంచి ఈ భూముల్లో ఉన్న వారికి బీఆర్‌ఎస్‌ హయాంలో ఎన్నడూ నోటీసులు రాలేదని చెప్పారు. ఇప్పుడు మాత్రం నోటీసులు వస్తున్నాయంటే కాంగ్రెస్‌ పాలన ఇట్టే అర్థమవుతోందన్నారు. ఇక్కడున్న ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌బాబు ఇంటికే నోటీసులు వస్తే పాలన ఎంత అసమర్థంగా ఉందో తెలిసిపోతుందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ ప్రత్యేక చొరవ చూపి బీఆర్‌ఎస్‌ లీగ్‌టీంను రంగంలోకి దింపారని తెలిపారు. ఎవరు కూడా అదైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ఇందిరమ్మ పాలన అంటూ పేదలను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు.. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఇక్కడి ఎమ్మెల్యే అసమర్థంగా ఉన్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేకు నోటీసు వస్తే ఈ ప్రాంత ప్రజలను ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ కనుసన్నల్లోనే ఈ నోటీసులు వచ్చినట్టు తెలిపారు. అధికారంలో ఉన్నప్పటికీ నోటీసుల వ్యవహారంలో రాజకీయం చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాకలెక్టర్‌ నుంచి నోటీసులు వచ్చినట్టు ఉండగా పట్టించుకోలేదన్నారు. దీని బట్టి పరిశీలిస్తే ఎమ్మెల్సీ కనుసన్నుల్లో ఈ వ్యవహరం జరిగినట్లు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతు కాగజ్‌నగర్‌ సర్‌సిల్క్‌ మిల్లులో తాను కార్మికుడిగా పని చేసినట్టు తెలిపారు. కార్మికుల కష్టాల తనకు తెలుసన్నారు. నోటీసులు వచ్చిన వారికి తాను పూర్తిగా అండగా ఉంటానని హామీ ఇఆచ్చరు. ఒక్క ఇల్లు కూలేందుకు అధికారులు చర్యలు తీసుకుంటే తాను ముందు ఉంటానని తెలిపారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 10:42 PM