Share News

మోదీ పాలనలో దేశానికి చేసిందేమీ లేదు

ABN , Publish Date - Aug 30 , 2026 | 11:55 PM

12 ఏళ్ల పాలనలో కేంద్రంలో ప్రధానమంత్రి నరేం ద్ర మోదీ చేసిందేమీ లేదని సీపీఐ జిల్లా కార్య దర్శి ఎస్‌ఎండీ ఫయాజ్‌ విమర్శించారు.

మోదీ పాలనలో దేశానికి చేసిందేమీ లేదు

- సీపీఐ జిల్లా కార్యదర్శి ఫయాజ్‌

కందనూలు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : 12 ఏళ్ల పాలనలో కేంద్రంలో ప్రధానమంత్రి నరేం ద్ర మోదీ చేసిందేమీ లేదని సీపీఐ జిల్లా కార్య దర్శి ఎస్‌ఎండీ ఫయాజ్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విఽధానాలను ప్రతిఘ టిస్తూ, ప్రజాస్వామ్య,రాజ్యాంగ పరిరక్షణ కోసం సెప్టెంబరు చలో ఢిల్లీ కార్యక్రమం చేపంట్టిదని ఆయన తెలిపారు. ఆదివారం ఫయాజ్‌ ఆధ్వ ర్యంలో నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి బయల్దే రారు. కేంద్రంలో మార్పు కావాలంటూ సీపీఐ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టినట్లు తెలిపా రు. హైదరాబాద్‌ నాంపల్లి స్టేషన్‌ నుంచి తెలం గాణ ఎక్స్‌ప్రెస్‌, ఇతర మార్గాల ద్వారా అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు ఢిల్లీ నగరానికి తరలి వెళ్తున్నామని తెలిపారు. ఢిల్లీలోని రాంలీలా మై దానంలో లక్షలాది మందితో సీపీఐ భారీ నిరసన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కా ర్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు బం డి లక్ష్మీపతి, బిజ్జ శ్రీనివాసులు, తుమ్మల శివుడు, వి.రవీందర్‌, ఈ.మల్లయ్య, టి.కిరణ్‌కుమార్‌, డి. ఆంజనేయులు, జే.రమేష్‌, కే.వెంకటమ్మ, ప్రేమ్‌ కుమార్‌ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.

ఫ తెలకపల్లి, (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభు త్వ విధానాలకు నిరసనగా సెప్టెంబరు 1న ఢి ల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరగనున్న మ హాధర్నాకు ఆదివారం తెలకపల్లి మండల నుం చి సీపీఐ నాయకులు తరలివెళ్లారు మండలం లోని రాయిపాకుల, పెద్దపల్లి, ఆలేరు, చిన్న ము ద్దునూరు, బండపల్లి తదితర గ్రామాల నుంచి సీపీఐ నాయకులు, కార్యకర్తలు వెళ్లారు. సీపీఐ మండల కార్యదర్శి రవీందర్‌మాట్లాడుతూ నల ్లధనాన్ని వెలికితీస్తామన్న హామీని విస్మరించి, ప్రభుత్వ సంపదను కార్పొరేట్‌ వ్యక్తులకు కట్టపెడుతోందని ఆరోపించారు.

Updated Date - Aug 30 , 2026 | 11:55 PM