కార్పొరేటర్లను చేర్చుకోవడం కాదు.. నగర అభివృద్ధిలో శ్రద్ధ చూపండి
ABN , Publish Date - Mar 27 , 2026 | 11:00 PM
మంచిర్యాల నగర పాలక సంస్థలో కార్పొరేటర్లను చేర్చుకోవడంలో ఉన్న శ్రద్ద నగర అభివృద్ధిపై చూపిం చాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్
మంచిర్యాల కలెక్టరేట్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల నగర పాలక సంస్థలో కార్పొరేటర్లను చేర్చుకోవడంలో ఉన్న శ్రద్ద నగర అభివృద్ధిపై చూపిం చాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ ముసాయిదాలో పే ర్కొన్న అంశాలు, కేటాయింపులు కేవలం స్వలాభం కో సం మాత్రమే ఉన్నాయని, ప్రజలకు కార్పొరేషన్ అభి వృద్ధిపై ఏమాత్రం చేరువలో లేవని ఎద్దేవా చేశారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించకుండా ఇటీ వల చుట్టు పక్కల ఉన్న గ్రామాలను మారుమూల ప్రాంతాలను కార్పొరేషన్‌లో విలీనం చేసిన విషయం మర్చిపోయి కేవలం వారి స్వలాభం కోసమే కార్పొరేష న్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారన్నారు. జిల్లాలో ము గ్గురు ఎమ్మెల్యేలు ఉండి కూడా అసెంబ్లీలో మంచి ర్యాల అభివృద్ధి విషయంపై మాట్లాడకపోవడం సరైం ది కాదన్నారు. అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేం సాగర్‌రావు వర్క్ ఆర్డర్, వర్క్ ఎస్టిమేషన్ లేకుండా అభివృద్ధి పేరుతో రోడ్లకిరుపక్కల ఉన్న వ్యాపారుల స్థలాలను కూల్చివేయడం హీనమైన చర్య అన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి బెదిరింపుల కు పాల్పడుతున్నారని, ఇటీవల గెలిచిన బీజేపీ ప్రజా ప్రతినిధులను బెదిరించి వారిని పార్టీలో చేర్చుకోవడం సిగ్గుమాలిన చర్య అన్నారు. బీజేపీ గెలిచిన ప్రాంతా ల్లోని డివిజన్‌లలో అభివృద్ధి విషయంలో ఆంక్షలు విధి స్తూ ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదన్నారు ఇలాంటి చర్యలు మానుకోకపోతే నిరసన కార్యక్రమా లు చేపడతామన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఎనగందుల కృష్ణమూర్తి, దుర్గం అశోక్, వెంకటేశ్వర్ రావు, శ్రీదేవి, కమలాకర్‌రావు, సదానందం, శ్రీనివాస్, సరిత, లావణ్య తదితరులు పాల్గొన్నారు.