kumaram bheem asifabad-చినుకు రాలదు.. చింత తీరదు
ABN , Publish Date - Jun 19 , 2026 | 10:55 PM
వాన కోసం జిల్లా రైతులు ఆకాశం వైపుకు దీనంగా ఎదురు చూస్తున్నారు. జూన్ నెల సగం దాటినా తొలకరి పలకరించకపోవడంతో వానా కాలం సాగుపై ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి వారం రోజుల గడుస్తున్నా.. జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక సాగు పనులు ఇంకా ఊపందుకో లేదు.
- అడుగంటుతున్న భూగర్భజలాలు
- వానాకాలం సాగు పనుల్లో జాప్యం
చింతలమానేపల్లి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): వాన కోసం జిల్లా రైతులు ఆకాశం వైపుకు దీనంగా ఎదురు చూస్తున్నారు. జూన్ నెల సగం దాటినా తొలకరి పలకరించకపోవడంతో వానా కాలం సాగుపై ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి వారం రోజుల గడుస్తున్నా.. జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక సాగు పనులు ఇంకా ఊపందుకో లేదు. ఓ వైపు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి మట్టాలు అడుగడుతుం డగా, మరో వైపు భూగర్భ జలాలు పడిపోతుం డడం రైతాంగాన్ని తీవ్ర కలవర పాటుకు గురి చేస్తోంది. ఈ సీజన్‌లో 4.6 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా వ్యవసాయ శాఖ అంచనా వేసినా.. ఎండ ల తీవ్రత 40 డిగ్రీలు దాటడం, వర్షాలు లేకపో వడంతో కనీసం నారుమడులు కూడా పోసుకోలేని పరిస్థితి నెలకొంది.
- మొదలు కాని సాగు పనులు..
జిల్లాలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఇంకా వానాకాలం సాగు పనులు ప్రారంభిం చలేదు. జూన్ మొదటి వారంలోనే వానాకాలం సీజన్ ప్రారంభం కావాల్సిఉండగా 15 రోజులు దాటినా వర్షాల జాడ లేక రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. ఏి్లాలోని ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి మట్టం చివరి దశకు చేరడంతో పాటు భూగర్భ జలాలు తగ్గుతుండడంతో బోరుబావులు సైతం ఎత్తిపోతున్నాయి. రైతులు కనీ సం నారుమడులు కూడా సిద్ధం చేసుకోలేని పరిస్ధితి లో ఉన్నారు. గత వానాకాలం సీజన్‌లో మే నెలలోనే వర్షాలు కురిసి జూన్ నెలలోనే వర్షాలు కురిసి జూన్ నెలలోగా 80 శాతానికి పైగా పంటల సాగు పూర్తయింది. కానీ ఈ సారి 18వ తేదీ దాటినా ఇంకా భారీ వర్షం కురువలేదు. జిల్లాలో వారం రోజుల నుంచి అడపా దడపా వర్షాలు కురిసినా నామమాత్రంగానే ఉన్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతు న్నారు. ఎల్‌నినో ప్రభావం వానాకాలం పంటల సాగుపై పడే అవకాశం ఉండడంతో పాటు జిల్లాలో ఇంకా 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవడం రైతులను మరింత కలవరపెడుతు న్నాయి. ఈ సారి వర్షాలు అంతంత మాత్రంగానే కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా రైతాంగం వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
- అధికారుల అంచనా ప్రకారం..
జిల్లాలో ఈ వర్షాకాలం సీజన్‌లో 4.6 లక్షల ఎక రాల్లో పంటల సాగు అవుతుందని వ్యవసా యశా ఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలోని చింతలమా నేపల్లి, కాగజ్‌నగర్ తదితర ప్రాంతాల్లో పత్తి విత్తనాలను పలువురు రైతులు విత్తుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవకముందే విత్తనాలు విత్తుకోవ ద్దని అధికారులు చెబుతున్నారు. మరి కొందరు రైతులు నారుమడులు సిద్దం చేసుకుం టున్నారు. ఏి్లాలో గత వానా కాలం పత్తి, వరి, కంది ఇతర పంటలను సాగు చేయగా అధికంగా పత్తి పంటనే సాగు చేశారు. ఈ వానాకాలం కూడా అధికంగా పత్తి పంటనే సాగు చేసేందుకు రైతులు సిద్ధం అవుతు న్నారు. 4.6 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతు న్నాయని అంచనా వేయగా ఇందులో సుమారుగా పత్తి 3.0 లక్షల ఎకరాలు, వరి 80వేల ఎకరాలు, కంది 40 వేల ఎకరాలు ఇతర పంటలు సాగయ్యే అవకాశం ఉన్నది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యా మ్నాయ పంటలపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నా జిల్లా రైతాంగం అధికంగా పత్తి పంట సాగుకే ఆసక్తి చూపుతు న్నారు. కాగా జూన్ నెల మరో పది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరగాల్సిన సమయంలో జిల్లాలో ఉష్ణోగ్రత్తలు 40 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, బోరుబావులు అడుగంటి నీటి మట్టం తగ్గిపోతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.