Share News

సాధారణ ప్రసవాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:17 PM

ప్రతీ గర్భిణికి ప్రభుత్వ ఆసుప త్రిలో ప్రసవమయ్యే పని చేయాలని, సాధారణ ప్రసవాలకు అధికప్రాఽధా న్యతనివ్వాలనిజిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కే.కృష్ణ అన్నారు.

సాధారణ ప్రసవాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి
మంతటి ఆరోగ్య ఉప కేంద్రంలో రికార్డులను పరిశీలిస్తున్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కే కృష్ణ

- జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కృష్ణ

కందనూలు, జూలై16 (ఆంధ్రజ్యో తి) : ప్రతీ గర్భిణికి ప్రభుత్వ ఆసుప త్రిలో ప్రసవమయ్యే పని చేయాలని, సాధారణ ప్రసవాలకు అధికప్రాఽధా న్యతనివ్వాలనిజిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కే.కృష్ణ అన్నారు. నాగర్‌క ర్నూల్‌ మండలం దేశిటిక్యాల బస్తీ ద వాఖాన, మంతటి ఆరోగ్య ఉప కేంద్రాన్ని, తెలక పల్లి మండలంలోని పెద్దూరు, బొప్పల్లి ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతీ రోజు అంది స్తున్న ఓపీసేవలను, స్టోర్‌లోని మందుల నిల్వ లను, టీ డయాగ్నోస్టిక్‌కు పంపిస్తున్న రక్త న మూనాల రికార్డులను పరిశీలించారు. మాతా, శిశు సంరణకు అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. గర్భవతుల పరీక్షల కోసం 102వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని సిబ్బం దికి సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారు లు డాక్టర్‌ శివరాజ్‌, డాక్టర్‌ నాగేశ్వరి, ఉప జిల్లా మాస్‌ మీడియా అధికారి రాజగోపాలాచారి, డీపీవో రేనయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 11:17 PM