kumaram bheem asifabad- బోధనేతర బరువు
ABN , Publish Date - Aug 20 , 2026 | 10:41 PM
ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధనేతర పనులతో ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు విద్యార్థుల నమోదు, తొలగింపు, రైస్ బ్యాలన్స్, కిచెన్ గార్డెన్, ఎండీఎం, ఆపార్, ఆధార్ తదితర వివరాల నమోదులో ఉపాధ్యాయులు బిజీ బిజీ.. మరోవైపు అటకెక్కిన సెల్‌ఫోన్ డిపాజిట్ ఆదేశాలు..వెరసి జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధన సరైన రీతిలో సాగడంలేదు. ఫలితంగా విద్యార్థులు చదువులో పూర్తిస్థాయిలో వెనకబడి పోతున్నారు.
- తరగతి గదుల్లో సాఫీగా జరగని బోధన
- అటకెక్కిన సెల్‌ఫోన్ డిపాజిట్ ఆదేశాలు
- విద్యార్థుల ఫలితాలపై ప్రభావం
వాంకిడి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధనేతర పనులతో ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు విద్యార్థుల నమోదు, తొలగింపు, రైస్ బ్యాలన్స్, కిచెన్ గార్డెన్, ఎండీఎం, ఆపార్, ఆధార్ తదితర వివరాల నమోదులో ఉపాధ్యాయులు బిజీ బిజీ.. మరోవైపు అటకెక్కిన సెల్‌ఫోన్ డిపాజిట్ ఆదేశాలు..వెరసి జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధన సరైన రీతిలో సాగడంలేదు. ఫలితంగా విద్యార్థులు చదువులో పూర్తిస్థాయిలో వెనకబడి పోతున్నారు. పునాది గట్టిగా ఉంటేనే ఇల్లు పది కాలలపాటు పదిలంగా ఉన్నట్లు లెక్క. ఇదే రీతిలో విద్యార్థికి ప్రాథమిక స్థాయిలో పునాది గట్టగా ఉంటేనే.. వారి భవిష్యత్ మెరుగ్గా ఉంటుంది. కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాథమిక విద్య పేక మేడలా మారింది. పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టి సారించక పోవడం వల్ల పిల్లలకు నాల్గవ సంవత్సరంలోనే ప్రైవేటు బడులకు పంపిస్తున్నారు. అక్కడే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యను పూర్తిచేసి ఆ తర్వాత ఒకటో తరగతిలో చేరుతున్నారు. ప్రభుత్వ నిబంధ నల ప్రకారం ఆరేళ్ల వయసు గల పిల్లలను మాత్ర మే ఒకటో తరగతిలో చేర్చుకోవడం జరుగుతుంది. ప్రీ ప్రైమరీ విద్య ప్రభుత్వ బడుల్లో లేనందు వల్ల తమ పిల్లలను ఎక్కవ మంది తల్లి తండ్రులు అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించడంలేదు. దీంతో అంగన్‌వాడీల్లో ఉన్న పిల్లలు మాత్రమే ప్రభుత్వ బడుల్లో 1వ తరగతిలో చేరుతున్నారు. ఇది కాస్త ఆడ్మిషన్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అన్ని పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి..
క్రమేణా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి అంపశయ్యపై ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటికీ ఇంకా విధానాలను మార్చక పోవడంతో పరిస్థితి గందరగోళంగా మారిందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. కానీ నత్యం విద్యాశాఖ నుంచి వచ్చే రిపోర్టులతోనే ఉపాద్యాయులు కుస్తీ పట్టే పరిస్థితి కొనసాగుతుంది. ప్రతీరోజు విద్యార్థులను ఎఫ్‌ఆర్‌ఎస్ తీయడంతో ప్రారంభమయ్యే దినచర్య.. ఆ తర్వాత విద్యార్థుల నమోదు, తొలగింపు, రైస్ బ్యాలన్స్, కిచెన్ గార్డెన్, ఎండీఎం, ఆపార్, ఆధార్ తదితర వివరాల నమోదుతో ముగుస్తుంది. సెల్ ఫోన్ల ద్వారా వచ్చే ఆన్‌లైన్ లింకులలో వివరాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చదువు సంగతి దేవుడెరుగు కానీ.. రిపోర్టులు మాత్రం సకాలంలో పంపడానికే సమయం కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది.
- ఆదేశాలు జారీ చేసినా..
బడుల్లో ఉపాధ్యాయుల చేతుల్లో సెల్‌ఫోన్లు లేకుండా ప్రధానోపాధ్యాయులు డిపాజిట్ చేసుకోవా లని గతంలోనే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా అవి కాలక్రమేణా కనుమరుగయ్యాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం బోధనేతర పనులను ఎట్టి పరస్థితుల్లో ఉపాధ్యాయులతో చేయించకూ డదన్న ఆదేశాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం రోజువారీ ఆన్‌లైన్ ద్వారా వచ్చే లింకుల్లో వివరా లను నమోదు చేసేందుకు చేతిలోనే సెల్‌ఫోన్ పెట్టుకోవాల్సి వస్తోంది. తరగతికి ఒక ఉపాధ్యా యుడు లేకపోవడంతో పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకుఅన్ని సబ్జెక్టులు పనిచేసే వారే బోదిం చాల్సి రావడం కష్టతంరంగా మారింది. ప్రాథమిక పాఠశాలల్లో ఎక్కువగా ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా ఒకరు సెలవు పెడితే మరొక ఉపాధ్యా యుడు బాధ్యతలను నిర్వర్తించాలి. ఈ నేపథ్యంలో రిపోర్టులతో కుస్తీ పట్టి మరోవైపు బోధన పై పూరి ్తస్థాయిలో దష్టి సారించే సమయం ఉండడంలేదన్న చర్చ జరుగుతుంది. విద్యా వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాలంటే ముందుగా ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి విముక్తి కలిగించాలి. పూర్తి సమయం బోధనకే కేటాయిస్తే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. లేని పక్షం లో విద్యా ర్థులకు ప్రాథమిక విద్య అంతంత మా త్రంగానే అందే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.