Share News

kumaram bheem asifabad- నోడల్‌ అధికారులు విధులు సమర్థవంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Jan 02 , 2026 | 10:51 PM

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో భాగం గా నోడల్‌ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌ భవన సమావేవ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి రెండో సాధారణ మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై నోడల్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు

kumaram bheem asifabad- నోడల్‌ అధికారులు విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో భాగం గా నోడల్‌ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌ భవన సమావేవ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి రెండో సాధారణ మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై నోడల్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో నోడల్‌ అధికారుకు కేఆయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ మ్యాన్‌పవర్‌ మేనేజర్‌మెంట్‌ నోడల్‌ అధికారిగా సబ్‌ కలెక్టర్‌, ఆసిఫాబాద్‌కు ఆర్డీవోలు వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి శిక్ష కార్యక్రమాలకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, ఎన్నికల సిబ్బందికి ఎన్నికల నిర్వహణలో అవసరమైన వాహనాలను సమకూర్చేందుకు జిల్లా రవాణా అధికారి, ఎన్నిల అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి జిల్లా ఉద్యానవన అధికారి నదీమ్‌ నోడల్‌ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఎన్నికల పరిశీలకులుగా జిల్లా మార్కెటింగ్‌ అధికారి అశ్వక్‌ అహ్మద్‌, బ్యాలెట్‌ పేపర ప్రింటింగ్‌కు డివిజనల్‌ పంచాయతీ అధికారి ఉమర హుస్సేన్‌, మీడియా కమ్యూని కేషన్‌కు జిల్లా డీపీఆర్‌వో సంపత్‌కుమార్‌ నోడల్‌ అదికారులుగా వ్యవహరిస్తారని అన్నారు. ఆసిఫాబాద్‌లో 20 వార్డులు, కాగజ్‌నగర్‌లో 30 వార్డులకు ఎన్నికల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్‌ ప్రదేశాలు, కేంద్రాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కమిషనర్లను ఆదేశించారు. ముసాయిదా ఓట్ల జాబితా సవరణలో భాగంగా వార్డుకు సంబందించిన ఓటరు అదే వార్డులో ఉండే విధంగా ఫొటో ఓటరు జాబితా రూపొందించాలని అన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్వీకరణ కేంద్రాలను గుర్తించాలని సూచించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్‌ జాస్తిన్‌ జోల్‌, నోడల్‌ అధికారులు, కమిషనర్లు గజానన్‌, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

ఆసిఫాబాద్‌రూరల్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల పాఠశాలలో శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చలి తీవ్రత దృష్ట్యా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో దుప్పట్లు అందించడం అభినందనీయ మన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రపంచ విఖ్యాత పుటబాల్‌ ఆటగాడు మెస్సితో కలిసి ఆడిన పుట్‌బాల్‌ పోటీల్లో పాల్గొన్న గురుకుల విద్యార్థిని ఈ సందర్భంగా కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏడీఏ మిలింథ్‌, ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 10:51 PM