Minister Tummala Nageswara Rao: రాష్ట్రంలో యూరియా కొరత లేదు
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:53 AM
రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా కొరత లేదని, రైతుల అవసరాలకు తగినంత యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా కొరత లేదని, రైతుల అవసరాలకు తగినంత యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత ఖరీ్‌ఫలో సరైన సమయంలో యూరియా సరఫరా కాకపోడం వల్ల కొంత ఇబ్బంది తలెత్తిందని, రబీలో కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. డిసెంబరులో 4 లక్షల టన్నుల విక్రయాలు జరిగాయన్నారు. ప్రస్తుతం 2 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయని, కలెక్టర్లు అడిగినంత స్టాక్ పంపుతున్నామని తెలిపారు.