No Toll Exemption: పండుగ సందర్భంగా టోల్ ఫ్రీ లేదు!
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:40 AM
హైదరాబాద్-విజయవాడ హైవేపై సంక్రాంతి పండుగ సమయంలో టోల్ ఫీజు మినహాయింపులేదు. సంక్రాంతి సమయంలో ఈ హైవేపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరుగుతోందని....
హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ మినహాయింపుఇవ్వలేమన్న కేంద్రం.. మౌఖికంగానే స్పష్టీకరణ
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్-విజయవాడ హైవేపై సంక్రాంతి పండుగ సమయంలో టోల్ ఫీజు మినహాయింపులేదు. సంక్రాంతి సమయంలో ఈ హైవేపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరుగుతోందని, దాంతో పంతంగి, కొర్లపాడు, చిల్లకల్లు టోల్‌ప్లాజాల దగ్గర ట్రాఫిక్‌జామ్ అవ్వడంతో పాటు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ మేరకు జనవరి 9 నుంచి 18 వరకు పదిరోజుల పాటు ఈ రోడ్డుపై వెళ్లే వాహనాలకు టోల్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ లేఖ రాసింది. ఈ అంశంపై స్పందించిన కేంద్రం ఈ హైవేపై ఉచిత టోల్ ఇవ్వలేమంటూ మౌఖికంగానే రాష్ట్రానికి తెలియజేసిందని విశ్వసనీయ సమాచారం.