Share News

క్రమబద్ధీకరణకు నో...

ABN , Publish Date - Jul 07 , 2026 | 10:41 PM

లే అవుట్‌ అ నుమతుల్లేని వెంచర్లు, అనధికార ప్లాట్లను క్రమబద్ధీ కరణకు ప్రభుత్వం రెడ్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎల్‌ఆర్‌ ఎస్‌-2020 నిబంధనలకు మంగళం పాడుతూ ఈ నెల 6వ తేదీన జీవో విడుదల చేసింది.

క్రమబద్ధీకరణకు నో...

-కొత్త దరఖాస్తుల స్వీకరణ నిలిపివేతకు ఆదేశాలు

-అక్రమ లే అవుట్లపై ప్రభుత్వ నిర్ణయం

-ఎల్‌ఆర్‌ఎస్‌-2020 నిబంధనలకు మంగళం

-నేటి నుంచి అమల్లోకి వచ్చేలా జీవో జారీ

-రుసుంపై కొనసాగనున్న 25 శాతం రాయితీ

మంచిర్యాల, జూలై 7 (ఆంధ్రజ్యోతి): లే అవుట్‌ అ నుమతుల్లేని వెంచర్లు, అనధికార ప్లాట్లను క్రమబద్ధీ కరణకు ప్రభుత్వం రెడ్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎల్‌ఆర్‌ ఎస్‌-2020 నిబంధనలకు మంగళం పాడుతూ ఈ నెల 6వ తేదీన జీవో విడుదల చేసింది. సవరించిన నిబం ధనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి కొ త్త దరఖాస్తు స్వీకరణను నిలిపి వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే క్రమబద్ధీకరణ రుసుము, ఇతర చా ర్జీలపై 25 శాతం రాయితీ కల్పిస్తూ కాంగ్రెస్‌ ప్రభు త్వం జారీ చేసిన జీవో 131 ప్రకారం ఈ నెలాఖరు వ రకు ఫీజు రాయితీ ప్రక్రియను కొనసాగించనుంది. ఈ నెల 31వ తేదీలోపు అనధికార వెంచర్లు, ప్లాట్లను క్ర మబద్ధీకరించుకోవాలనుకునే వారికి మాత్రమే ఈ ఆ ఫర్‌ వర్తించనుంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ఆంక్షలు... గత మూడేళ్లుగా ఆ రంగంపై ఆధారపడ్డ వ్యాపారులను తీ వ్ర ఇబ్బందులకు గురి చేశాయనడంలో ఎలాంటి అతి శయోక్తిలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్‌ ప్ర భుత్వం 2024లో కొన్ని సంస్కరణలు చేసినా...అవి పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఫీజులో రాయితీ ఇస్తూ మరోమారు అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యా ప్తంగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీల్లో 2015 లో ఎల్‌ఆర్‌ఎస్‌ (లే అవుట్‌ రెగ్యులేషన్‌ స్కీం) గడువు ముగిసిపోగా, దాదాపు నాలుగేళ్ల తరువాత తిరిగి 2020 ఆగస్టు 31న ఆ ప్రక్రియకు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం పచ్చజెండా ఊపింది. అదే రోజు నుంచి ఎల్‌ ఆర్‌ఎస్‌ అమల్లోకి వస్తుందంటూ నిబంధనలతో కూడి న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి నాటి ప్రభుత్వం ఎలాంటి నియమ నిబం ధనలు విడుదల చేయకపోవడంతో ధరఖాస్తు ప్రక్రియ కు అంతరాయం ఏర్పడింది. ఆన్‌లైన్‌ కేంద్రాల్లో సంబం ధిత వెబ్‌సైట్‌ తెరుచుకోకపోవడంతో ధరఖాస్తు ప్రక్రియకు బ్రేక్‌ పడింది.

ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీ స్పందన....

ఎల్‌ఆర్‌ఎస్‌కు అప్పటి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వ డంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి స్పందన వ చ్చింది. రియల్‌ ఎస్టేట్‌ రంగం ఊపు మీదున్న మున్సి పాలిటీలు, గ్రామ పంచాయితీల్లో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండగా, మిగతా చోట్ల అరకొరగా దరఖా స్తులు వచ్చాయి. జిల్లాలోని మంచిర్యాల మునిసిపల్‌ కార్పొరేషన్‌, బెల్లంపల్లి, క్యాతన్‌పల్లి, చెన్నూరు, లక్షెట్టిపే ట మున్సిపాలిటీల్లో అధిక సంఖ్యలో భూములు ఉన్నా యి. వాటిలో అనధికార లే అవుట్‌ వెంచర్లు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్‌కు ధరఖాస్తు చేసేం దుకు ముందుకు వచ్చారు. జిల్లా కేంద్రంలోనే పదుల సంఖ్యలో అక్రమ లే ఔట్లు ఉండగా, లక్షెట్టిపేట, చె న్నూరు, బెల్లంపల్లి మున్సిపాలిటీల పరిధిలో కూడా అ ధిక సంఖ్యలో అక్రమ వెంచర్లు ఉన్నాయి. అదే విధం గా గ్రామ పంచాయతీల పరిధిలో కూడా అక్రమ వెం చర్లు, ప్లాట్లు అధికంగా ఉండగా హాజీపూర్‌, జైపూర్‌, భీమారం, లక్షెట్టిపేట లాంటి ప్రాంతాల్లో రియల్‌ ఎస్టే ట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది.

49వేల దరఖాస్తులు పెండింగ్‌...

జిల్లాలోని మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో క్రమబద్ధీకరణ కోసం చేసిన మొత్తం 49,785 దరఖా స్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 2020 ఆగస్టు 26 లోపు రిజిష్టర్డ్‌ సేల్‌ డీడ్‌ ద్వారా జరిగిన నాన్‌ లే అవుట్‌ వెం చర్లు, ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తింపజేయనున్నట్లు బీ ఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించడంతో వ్యాపారుల నుంచి భారీ స్పందన లభించింది. ఎల్‌ఆర్‌ఎస్‌కు నామ మా త్రంగా రూ. 1000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో జిల్లా వ్యాప్తంగా 2020 అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్య కాలంలో మున్సిపాలిటీల్లో ఏకంగా 45,863 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 5,097 దరఖా స్తులను ఆమోదించగా, 1,723 దరఖాస్తులను తిరస్క రించారు. ఇంకా 39,043 పెండింగ్‌లో ఉన్నాయి. దర ఖాస్తుదారులంతా నిబంధనల మేరకు క్రమబద్దీకరణ ఫీజు 25 శాతం రాయితీతో చెల్లించాల్సి ఉంది. అలాగే గ్రామ పంచాయతీల నుంచి 10,742 దరఖాస్తులు రా గా, వాటిలో అర్హతగల 7,674 మందికి రసుము చె ల్లించాలనే లేఖలు జారీ అయ్యాయి. లేఖలు జారీ అయిన వారిలో 2,402 మంది రుసుము చెల్లించగా, 1,058 మందికి ప్రొసీడింగ్‌లు జారీ చేశారు. మిగతా వారు ఈ నెల 31లోపు నిర్ణీత రుసుం చెల్లించి, ప్రక్రి య పూర్తి చేసుకోవలసి ఉంటుంది.

సవరణలు అనుకూలించేనా...?

ఎల్‌ఆర్‌ఎస్‌-2020 నిబంధనలను సవరించే క్రమం లో కొత్త దరఖాస్తులను నిలిపివేస్తూ ప్రభుత్వం జీఓ ఎంఎస్‌ నెంబర్‌ 28 జారీ చేసింది. ఇందులో భాగంగా 07-07-2026 తరువాత ఐజీఆర్‌ఎస్‌ (ఇన్‌స్పెక్టర్‌ జన రల్‌ రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌) విధానం ద్వారా ఎటు వంటి కొత్త దరఖాస్తులు స్వీకరించరాదని ఉత్తర్వులు వెలువరించింది. దీంతో ఉన్నఫలంగా ఎల్‌ఆర్‌ఎస్‌ కో సం కొత్త దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోయింది. బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం హయాం నుంచే రియల్‌ ఎస్టేట్‌ రం గంపై ఆంక్షలు ప్రారంభంకాగా, 20-02-2025లో కాం గ్రెస్‌ సర్కారు కూడా అదే దారిలో పయనించినప్పటికీ, కొత్తగా 25 శాతం డిస్కౌంట్‌ సౌకర్యం కల్పించడంతో స్థిరాస్థి వ్యాపారులు, వినియోగదారులకు కొంతమేర ఉపశమనం లభించింది. ప్రస్తుతం 2020 నిబంధన లను రద్దు చేయగా, నాల్‌ లే అవుట్‌ వెంచర్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కొత్తగా ఏ నిర్ణయం తీసు కుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. గత మూడేళ్లలో రియల్‌ ఎస్టేట్‌ రంగం పూర్తిగా కుదేలుకాగా, ప్రత్యక్షం గా, పరోక్షంగా ఆ రంగంపై ఆధారపడ్డ లక్షలాది మంది ఉపాధిలేక రోడ్డున పడాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా డాక్యుమెంటేషన్‌ గణనీయంగా తగ్గడంతో ప్రభుత్వ ఆ దాయానికి సైతం భారీగానే గండి పడింది. ఈ క్రమం లో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా చూడాలనే విజ్ఞప్తులు ఉన్నాయి.

Updated Date - Jul 07 , 2026 | 10:41 PM