Share News

రైస్‌ నో స్టాక్‌...

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:16 AM

ఎల్‌నినో పరిస్ధితుల నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రభు త్వ పరంగా బియ్యం దుకాణాలు ప్రారంభించిన విష యం తెలిసిందే. ఇందులో బహిరంగ మార్కెట్‌తో పని లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు బియ్యం వి క్రయించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా దుకా ణాలు ఏర్పాటు చేశారు. ప్ర

రైస్‌ నో స్టాక్‌...

ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన దుకాణాల్లో నిండుకున్న బియ్యం నిలువలు

- ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు

- కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు

- ఎల్‌నినో వేళ ప్రజలకు తప్పని ఇబ్బందులు

మంచిర్యాల, నవంబర్‌ 19(ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో పరిస్ధితుల నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రభు త్వ పరంగా బియ్యం దుకాణాలు ప్రారంభించిన విష యం తెలిసిందే. ఇందులో బహిరంగ మార్కెట్‌తో పని లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు బియ్యం వి క్రయించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా దుకా ణాలు ఏర్పాటు చేశారు. ప్రజల క్షేమం కోరి ప్రభుత్వం రైస్‌ డిపోలు ఏర్పాటు చేసినప్పటికీ నో స్టాక్‌ పేరుతో ప్రజ లను ఇబ్బం దులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. ఎల్‌ని నో కారణంగా వరి పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపగా సన్న రకం బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనిని ఆసరా తీసుకున్న కొందరు వ్యాపారులు సన్న బియ్యాన్ని అక్రమంగా నిలు వ చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మా నవీయ కోణంలో ప్రజలకు బియ్యాన్ని విక్రయించాలని అధికారులు కోరుతున్నప్పటికీ వ్యాపారుల నుంచి తగిన రీతిలో స్పందన కాన రావడం లేదు. వ్యాపారుల కృత్రిమ కొరత కారణంగా ప్రభుత్వం ప్రకటించిన ధరలకు బియ్యం అందుబాటులో లేవు.

జిల్లా వ్యాప్తంగా 11 దుకాణాల ఏర్పాటు....

ఎల్‌నినో ప్రభావం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా సాధారణ రేట్లకే బియ్యం విక్రయించేలా ప్రభుత్వం చర్యలు చేప ట్టింది. ఇందులో భాగంగా ప్రైవేటు వ్యాపారులకు ధీటుగా ప్రభు త్వ డిపోలను ప్రారంభించింది. ముఖ్యంగా సామాన్య ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు సన్న రకం బియ్యం ఽధరలను నిర్ణ యిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనే ఆదేశాలు జారీ చేసిం ది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి, చె న్నూరు, లక్షెట్టిపేట, జన్నారంతో పాటు ఇతర మండలాలలో ప్ర భుత్వ పరంగా మొత్తం 11 దుకాణాలను ఏర్పాటు చేశారు. ఇందు లో ప్రభుత్వం నిర్ణయించిన మేరకే బియ్యం విక్రయాలు జరపాల న్న స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే వాటిని పెడ చెవిన పెడుతున్న పలు షాపుల యజమానులు కృత్రిమ కొరత పేరుతో సన్న బియ్యం ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తు న్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయు.

సన్న బియ్యం ధరలు ఇలా....

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ నిర్ణయించిన ప్రకారం వివిధ రకాల సన్న బియ్యం ధరలు ఇలా ఉన్నాయి. 26 కిలోల బ్యాగుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన దుకా ణాలలో ఈ ధరలు అమలు చేయాల్సి ఉంది. అందుకు భిన్నంగా బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన దుకాణాలలో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినియోగదారులు సన్న బియ్యం కోసం ఆయా షాపులకు వెళ్తే జై శ్రీరాం లాంటి సన్న రకం అందుబాటులో లేక నిరాశతో వెనుదిరగాల్సిన పరి స్థితులు నెలకొన్నాయి.

ప్రైవేటులో రూ. 8 వేలు పలుకుతున్న బియ్యం ధరలు.....

ఎల్‌నినో ప్రభావం కారణంగా ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాగుపై తీవ్ర ప్రభావం చూపడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయం లో ఎల్‌నినో ప్రతాపం చూపడంతో పెట్టుబడులు కూడా గిట్టుబా టు కాని పరిస్ధితులు నెలకొన్నాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా వరి పంటలో 20 నుంచి 30 శాతం దిగుబడికి నష్టం వాటిల్లగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సైతం ఆశాజనకంగా లేకపో వడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు లో దాన్యాన్ని విక్రయించేందుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన బియ్యం షాపులలో జై శ్రీరాం పాత రకం ధర దాదాపు 7 వేల పైచిలుకు ఉండగా అదే ప్రైవే టు మార్కెట్‌లో 9 వేల పైచిలుకు ధర పలుకుతుంది. 25 కేజీల బ్యాగు రూ. 2400 పై చిలుకు ధర పలుకుతుండడంతో వరి సాగు చేసిన రైతులు ప్రైవేటు ఆశ్రయించేందుకు సన్నద్ధమవుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రభుత్వ దుకాణాల నిర్వాహకులు సైతం ఉద్దేశపూర్వకంగా సన్న రకం బియ్యం విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అలా సన్నబియ్యాన్ని ప క్క దారి పట్టించి ప్రైవేటు మార్కెట్‌లో విక్రయించడం ద్వారా రె ట్టింపు లాభం పొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ దుకాణాల నిర్వాహకుల వైఖరి కారణంగా ప్రజలపై అదనపు భా రం పడుతుండగా ప్రభుత్వ లక్ష్యం సైతం నెరవేరడం లేదు.

బియ్యం రకాలు ధర 26కేజీ బ్యాగు

బీపీటీ రూ. 52 రూ. 1352

బీపీటీ స్టీమ్‌ రూ. 57 రూ. 1482

బీపీటీ పాతవి రూ. 63 రూ. 1638

హెచ్‌ఎంటీ పాతవి రూ. 75 రూ. 1950

జై శ్రీరాం పాతవి రూ. 76 రూ. 1976

Updated Date - Nov 20 , 2026 | 12:20 AM