Share News

గురుకులాల్లో సరుకుల కొరత రావొద్దు: అడ్లూరి

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:52 AM

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు నిత్యావసర సరుకుల సరఫరాలో అంతరాయం కలగనివ్వద్దని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆదేశించారు.

గురుకులాల్లో సరుకుల కొరత రావొద్దు: అడ్లూరి
adluri

హైదరాబాద్‌, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు నిత్యావసర సరుకుల సరఫరాలో అంతరాయం కలగనివ్వద్దని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. సరుకుల సరఫరా, నిల్వలు, పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని టీజీడీడబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ, టీజీటీడబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీల కార్యదర్శులను ఆదేశించారు. సరుకుల సరఫరా, నిల్వల పరిస్థితి, క్షేత్రస్థాయి తనిఖీల్లో గుర్తించిన అంశాలు, సరుకుల నాణ్యత లేదా లభ్యతపై వెలువడే ప్రతికూల వార్తా కథనాలు, వాటిపై తీసుకున్న దిద్దుబాటు చర్యల వివరాలతో నెలవారీ నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

Updated Date - Oct 16 , 2026 | 06:03 AM