Share News

వైద్య ఖర్చులకు ఎవరూ ఇబ్బంది పడొద్దు

ABN , Publish Date - Jun 27 , 2026 | 11:33 PM

వైద్యం చేయిం చుకునేందుకు డబ్బులు వేవని ఎవరూ ఇబ్బంది పడకూ డదని ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తన తా పత్రయం అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసా గర్‌రావు అన్నారు.

వైద్య ఖర్చులకు ఎవరూ ఇబ్బంది పడొద్దు

ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

లక్షెట్టిపేట, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): వైద్యం చేయిం చుకునేందుకు డబ్బులు వేవని ఎవరూ ఇబ్బంది పడకూ డదని ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తన తా పత్రయం అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసా గర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని కేఎస్‌ ఆర్‌ ఫంక్షన్‌ హాలులో దండేపల్లి, లక్షెట్టిపేట మండ లం లోని లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన నియోజకవర్గంలో సీఎంఆర్‌ఎఫ్‌ చె క్కులను, ఎల్‌వోసీలను ఎక్కువ మొత్తంలో అందిస్తున్నామన్నారు. నాయకులు కార్యకర్తలు కూడా ప్రజలకు సేవ చేయాలని పార్టీని నమ్ముకున్న ప్రతీ ఒక్కరికి తప్పకుం డా ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. అనంతరం రెండు మండలాల కు చెందిన సుమారు 117మంది లబ్ధిదారులకు సీఎం ఆర్‌ఎఫ్‌ చెక్కులను నాయకులతో కలిసి అందజేసారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంత అంజలిన ర్సయ్య, వైస్‌ చైర్మన్‌ మోత్కూరి రాజేశ్వరివెంకటస్వామి, తహసీల్దార్‌లు దిలీప్‌కుమార్‌, రోహిత్‌ దేశ్‌ పాండే, ఎంపీడీవో ప్రసాద్‌, ఆర్టీఏ మెంబర్‌ అంకతి శ్రీనివాస్‌, ఆర్జీపీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, కాంగ్రె స్‌ పార్టీ జిల్లా నాయకులు చెల్ల నాగభూషణం, చింత అ శోక్‌కుమార్‌, పూర్ణచందర్‌రావు, పార్టీ అధ్యక్షుడు షాహె ద్‌ఆలీ, నలి మెల రాజు, అక్కల వెంకటేశ్వర్లు, మాజీ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఆరీఫ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 11:33 PM