Share News

Optional Holiday: నేడు సెలవు లేనట్లే

ABN , Publish Date - Jan 01 , 2026 | 07:55 AM

ఆంగ్ల నామ సంవత్సరం ప్రారంభమయ్యే జనవరి 1న ఈసారి సెలవు లేనట్లే.

Optional Holiday: నేడు సెలవు లేనట్లే

  • గతంలో జనవరి 1న సాధారణ సెలవు

  • ఈసారి ఐచ్ఛిక సెలవుగా మార్పు

హైదరాబాద్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ఆంగ్ల నామ సంవత్సరం ప్రారంభమయ్యే జనవరి 1న ఈసారి సెలవు లేనట్లే. ప్రభుత్వ కార్యాలయాలకు ఈసారి ప్రభుత్వం సెలవు ప్రకటించలేదు. ఏటా జనవరి 1న సాధారణ సెలవుగా ప్రకటిస్తూ వచ్చిన ప్రభుత్వం... ఈసారి దానిని ఐచ్ఛిక సెలవు దినంగా మార్చింది. 2026లో అమలయ్యే సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవుల(ఆప్షనల్‌ హాలిడేస్)ను ప్రభుత్వం డిసెంబరులో ప్రకటించింది. అందులో జనవరి1న ఐచ్ఛిక సెలవు ఉంటుందని తెలిపింది. నిజానికి 2025 జనవరి 1న(బుధవారం), 2024 జనవరి 1న(సోమవారం), 2023 జనవరి1న(ఆదివారం) సాధారణ సెలవులుగా ప్రకటిస్తూ వచ్చింది. ఈసారి ఐచ్ఛిక సెలవుగా ప్రకటించడంతో ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పని చేస్తాయి.

Updated Date - Jan 01 , 2026 | 07:56 AM