Share News

ఒప్పంద ల్యాబ్‌ టెక్నీషియన్ల కొనసాగింపునకు నో

ABN , Publish Date - Jan 24 , 2026 | 04:45 AM

రాష్ట్రంలో వైద్య విద్య సంచాలకుల పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ విధానంలో నియమితులైన ల్యాబ్‌ టెక్నీషియన్ల సేవలకు ఇకపై కొనసాగింపు ఉండదని ...

ఒప్పంద ల్యాబ్‌ టెక్నీషియన్ల కొనసాగింపునకు నో

  • నేరుగా నియామకాలు పూర్తవడంతోనే : డీఎంఈ స్పష్టం

హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో వైద్య విద్య సంచాలకుల పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ విధానంలో నియమితులైన ల్యాబ్‌ టెక్నీషియన్ల సేవలకు ఇకపై కొనసాగింపు ఉండదని వైద్యవిద్య సంచాలకుల(డీఎంఈ) కార్యాలయం పేర్కొంది. ఇప్పటికే నేరుగా నియామక ప్రక్రియ పూర్తవడంతో, ప్రభుత్వం ఇకపై కాంట్రాక్ట్‌ విధానంలో ల్యాబ్‌ టెక్నీషియన్లను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వబోదని తెలిపింది. 2025 ఏప్రిల్‌ 1 నుంచి 2026 మార్చి 31 వరకు ఒక సంవత్సరం కాలానికి వివిధ కేటగీరీల్లో మొత్తం 16,448 మంది సిబ్బందిని(కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌) కొనసాగించేందుకు ప్రభుత్వం గతంలో అనుమతి ఇచ్చినట్లు డీఎంఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే రెగ్యులర్‌ పోస్టులు భర్తీ అయిన నేపథ్యంలో కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ల్యాబ్‌ టెక్నీషియన్లను కొనసాగించబోమని డీఎంఈ స్పష్టం చేసింది.

Updated Date - Jan 24 , 2026 | 04:46 AM