kumaram bheem asifabad- నో బ్యాగ్ డే
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:36 PM
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 19 నుంచి బ్యాగ్ లెస్ డే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీం తో అధిక బరువుతో పుస్తకాల బ్యాగులు మోస్తున్న విద్యార్థులకు ప్రతీ నెల మూడో శనివారం ఊరట కలుగనుంది. ఏడాదిలో పది రోజులు బ్యాగుల మోతకు చెక్ పడనుంది. రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (స్టెట్ కౌన్సిలింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్)ప్రత్యేకంగా రూపొందించిన మాడ్యూ ల్‌ను జిల్లాలో ఉపాధ్యాయులు అమలు చేసేలా విద్యాశాఖ కార్యాచ రణను సిద్ధం చేసింది.
వాంకిడి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 19 నుంచి బ్యాగ్ లెస్ డే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీం తో అధిక బరువుతో పుస్తకాల బ్యాగులు మోస్తున్న విద్యార్థులకు ప్రతీ నెల మూడో శనివారం ఊరట కలుగనుంది. ఏడాదిలో పది రోజులు బ్యాగుల మోతకు చెక్ పడనుంది. రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (స్టెట్ కౌన్సిలింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్)ప్రత్యేకంగా రూపొందించిన మాడ్యూ ల్‌ను జిల్లాలో ఉపాధ్యాయులు అమలు చేసేలా విద్యాశాఖ కార్యాచ రణను సిద్ధం చేసింది. ప్రతీ నెల మూడో శనివారం పుస్తకాల బ్యాగులు లేకుండా పాఠశాలకు హాజరుకానున్నారు.
- బ్యాగ్ లెస్ డేలు ఇలా..
ఈ విద్యా సంవత్సరంలో సెప్టెంబరు 19, నవంబ రు 21, డిసెంబరు 19, ఫిబ్రవరి 20, మార్చి 20, బ్యాగ్‌లెస్ డేలు నిర్వహించనున్నారు. తరగతి గదిలో సంప్రదాయ పద్ధతిలో చెప్పే ఒత్తిడిలేని చదువు కాకుండా వృత్తి విద్యా అనుభవపూర్వకంగా అభ్యస నాలు చేయిస్తారు. విద్యార్థులను ఇంటారక్టివ్ చేస్తా రు. ఇందులో భాగంగా చారిత్రక కట్టడాలు, సాంస్కృ తిక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలు, ఉన్నత విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, సౌర విద్యుత్, పార్కులు, బయోగ్యాస్ ప్లాంట్‌లకు తీసుకెళ్లి చూపి స్తారు. కళలు, క్రీడలు, పర్యావరణ, చేతి పనులు, సృజనాత్మక కార్యకలాపాలు, వాస్తవ అనుభవాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. కుల వృత్తి నిపుణుల వద్ద శిక్షణ ఇప్పిస్తారు. పర్యావరణ పరిరక్షణ కోసం గో గ్రీన్ సైకిల్ ర్యాలీలో పాల్గొనేలా చేస్తారు. ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్ వంటి అభివృద్ది చెందుతున్న రంగాలపై నిపుణులతో సెషన్స్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటారు. విద్యార్థుల వయస్సుకు అనుగు ణం గా వారికున్న ఆసక్తికర అంశాలు, అందుబాటులో ఉ న్న వనరుల ఆధారంగా కార్యకలాపాలను ఎంచుకునే అవకాశం ఆయా పాఠశాలలకు ఉంటుంది.