Share News

మెడికల్‌ టీచర్ల అర్హతలపై కమిటీ ఏర్పాటు

ABN , Publish Date - Apr 19 , 2026 | 06:43 AM

దేశవ్యాప్తంగా మెడికల్‌ కళాశాలల్లో ప్రొఫెసర్లు, అధ్యాపకుల అర్హత నిబంధనల పరిశీలన, మార్పుల కోసం జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

మెడికల్‌ టీచర్ల అర్హతలపై కమిటీ ఏర్పాటు

  • సభ్యుడిగా నిమ్స్‌ వైద్యుడు గంగాధర్‌కు చోటు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : దేశవ్యాప్తంగా మెడికల్‌ కళాశాలల్లో ప్రొఫెసర్లు, అధ్యాపకుల అర్హత నిబంధనల పరిశీలన, మార్పుల కోసం జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌కు చెందిన నిమ్స్‌ ఆస్పత్రి నెఫ్రాలజీ విభాగం ప్రొఫెసర్‌ తాడూరి గంగాధర్‌ కమిటీ సభ్యునిగా నియమితులయ్యారు. ఎన్‌ఎంసీలోని పోస్టు గ్రాడ్యుయేషన్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు (పీజీఎంఈబీ) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్మన్‌గా డాక్టర్‌ విజయ్‌ ఓజా (మాజీ ప్రెసిడెంట్‌, పీజీఎంఈబీ), సభ్యులుగా ప్రొఫెసర్‌ గంగాధర్‌ (నిమ్స్‌, హైదరాబాద్‌), ప్రొఫెసర్‌ వివేక్‌ ఏ సావంజీ (వీసీ, భారతీ విద్యాపీఠ్‌, పూణే) నియమితులయ్యారు. ఇక కమిటీ టీచర్స్‌ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్‌కు సంబంధించి ఎదురవుతున్న క్లిష్టమైన సమస్యలను, దరఖాస్తులను ఈ కమిటీ లోతుగా పరిశీలించి తగిన సిఫార్సులు చేస్తుంది. మెడికల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ రెగ్యులేషన్స్‌-2025లోని ప్రస్తుత నిబంధనలను సమీక్షించి, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త స్పెషాలిటీల అభివృద్థిని దృష్టిలో ఉంచుకుని తగిన సవరణలను సూచిస్తుంది.

Updated Date - Apr 19 , 2026 | 06:45 AM