ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి పదేళ్ల గడువు!
ABN , Publish Date - May 28 , 2026 | 03:16 AM
వైద్య విద్య (ఎంబీబీఎస్) నిబంధనల్లో జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) కీలక సవరణను ప్రతిపాదించింది. ఈ మేరకు బుధవారం కొత్త ముసాయిదా....
ఫస్టియర్ పాస్ కావడానికి 4 అవకాశాలే
ఎన్‌ఎంసీ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల
30 రోజుల్లో అభ్యంతరాలు, సూచనలు పంపవచ్చు
హైదరాబాద్, మే 27(ఆంధ్రజ్యోతి): వైద్య విద్య (ఎంబీబీఎస్) నిబంధనల్లో జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) కీలక సవరణను ప్రతిపాదించింది. ఈ మేరకు బుధవారం కొత్త ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఒక విద్యార్థి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించడానికి గరిష్ఠంగా నాలుగు అవకాశాలు మాత్రమే ఇవ్వనున్నారు. అదేవిధంగా మొత్తం ఎంబీబీఎస్ కోర్సును చేరిన ఏడాది నుంచి 10 సంవత్సరాల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో కోర్సులో చేరిన తేదీ నుంచి 9 సంవత్సరాల గడువు ఉండేది. తాజా సవరణతో ఇంటర్న్‌షిప్‌ను కలుపుకొని ఈ గడువును 10 ఏళ్లకు పెంచుతూ ప్రతిపాదించారు. దీనిపై 30 రోజుల్లో తమ అభ్యంతరాలు, సూచనలు పంపవచ్చని పేర్కొంది. ఆసక్తి గలవారు నిర్దేశిత ఫార్మాట్‌లో ఈ-మెయిల్ ఐడీ ద్వారా మాత్రమే ug_gmer_amend_2026@nmc.org.inకు పంపాల్సి ఉంటుంది. లేఖలు లేదా ఇతర మార్గాల్లో పంపితే స్వీకరించబోమని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఎన్‌ఎంసీ అధికారిక వెబ్‌సైట్ www.nmc.org.inను సందర్శించవచ్చు.