Share News

హెచ్‌ఎంఐఎస్‌ వివరాలు వారంలోగా పంపండి

ABN , Publish Date - Mar 02 , 2026 | 02:00 AM

వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రులను ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన(పీఎం-జే) పోర్టల్‌తో పాటు ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న...

హెచ్‌ఎంఐఎస్‌ వివరాలు వారంలోగా పంపండి

  • వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ ఆదేశాలు

హైదరాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రులను ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన(పీఎం-జే) పోర్టల్‌తో పాటు ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్‌ఎంఐఎస్‌(హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌) వ్యవస్థతో అనుసంధానం చేయాలని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఆదేశించింది. ఈ మేరకు ఫిబ్రవరి 28న జారీ చేసిన ఉత్తర్వుల్లో, ఎన్‌ఎంసీ పరిధిలోని డీన్‌లు, ప్రిన్సిపాళ్లు తమ వైద్య కళాశాలలకు సంబంధించిన హెల్త్‌ ఫెసిలిటీ రిజిస్ట్రీ ఐడీలను ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి ధ్రువీకరించాలని సూచించింది. మిగిలిన హెచ్‌ఎ్‌ఫఆర్‌ ఐడీలు, తమ హెచ్‌ఎంఐఎస్‌ వివరాలతో పాటు అవి పీఎం-జే/ఏబీడీఎం-హెచ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌తో అనుసంధానమైన సమాచారాన్ని సమర్పించాలని కోరింది. కాగా, దేశవ్యాప్తంగా వైద్య కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి కొత్త పీజీ వైద్య కోర్సులు ప్రారంభించడం, ప్రస్తుత పీజీ కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంపు, కొత్త స్టాండలోన్‌ మెడికల్‌ ఇనిస్టిట్యూషన్‌ స్థాపన దరఖాస్తులు 31వరకు అందుబాటులో ఉంటాయని ఎన్‌ఎంసీ తెలిపింది.

Updated Date - Mar 02 , 2026 | 02:00 AM