లండన్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డ నిజామాబాద్ యువకుడి మృతి
ABN , Publish Date - Feb 28 , 2026 | 03:51 AM
లండన్‌లోని క్రొయిడన్ డప్పాస్ హిల్స్ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ నిజామాబాద్ యువకుడు మృతి చెందాడు. నగరంలోని వినాయక్‌నగర్‌కు...
ఇందూర్, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): లండన్‌లోని క్రొయిడన్ డప్పాస్ హిల్స్ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ నిజామాబాద్ యువకుడు మృతి చెందాడు. నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన కామినేని సాయిశ్రీకర్(27) మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అభిషేక్ అనే యువకుడు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. రెండో అంతస్తులో గ్యాస్ లీకరు చెలరేగిన మంటలు మొదటి అంతస్తుకు రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.