Share News

ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కంటైనర్‌ లారీ

ABN , Publish Date - Aug 14 , 2026 | 06:06 AM

ఆగి ఉన్న బస్సును కంటైనర్‌ లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం గోవింద్‌పేట్‌ శివారులోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై గురువారం ఈ ప్రమాదం జరిగింది.

ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కంటైనర్‌ లారీ

  • ఇద్దరు మహిళల దుర్మరణం.. మరో ఇద్దరికి గాయాలు

  • నిజామాబాద్‌ జిల్లా గోవింద్‌పేట్‌లో ప్రమాదం

ఆర్మూర్‌ టౌన్‌, ఆగస్టు 13(ఆంరఽధజ్యోతి): ఆగి ఉన్న బస్సును కంటైనర్‌ లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం గోవింద్‌పేట్‌ శివారులోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై గురువారం ఈ ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కిన్వట్‌ గ్రామానికి చెందిన 69 మంది కలిసి గురువారం ఉదయం రెండు బస్సుల్లో హైదరాబాద్‌కు బయల్దేరారు. నిజామాబాద్‌ జిల్లాలోని గోవింద్‌పేట్‌ శివారులో ఒక బస్సు టైర్‌ పేలిపోవడంతో రోడ్డుపైనే నిలిపివేశారు. టైర్‌ను మార్చే సమయంలో అందులోని ప్రయాణికులు కిందికి దిగి డివైడర్‌పై కూర్చున్నారు. ఇంతలో గుజరాత్‌కు చెందిన కంటైనర్‌ వెనుక నుంచి అతివేగంగా బస్సును ఢీకొట్టింది. దీంతో డివైడర్‌పై కూర్చున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్లింది. దీంతో తిర్మన్‌వార్‌ మాధవి(47), నెమ్మన్వర్‌ సుజాత(54) అక్కడిక్కడే మృతి చెందగా... సునీత, మనీషాకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సీపీ సాయిచైతన్య, ఏసీపీ వెంకటేశ్వర్‌ రెడ్డి పరిశీలించి బాధిత కుటుంబాలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Aug 14 , 2026 | 06:08 AM