అలుగే జలపాతమాయనే..!!
ABN , Publish Date - Aug 05 , 2026 | 05:09 AM
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి సమీపంలోని శీలం జానకీబాయి చెరువు అలుగు ఇది.
ఇంటర్నెట్ విభాగం: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి సమీపంలోని శీలం జానకీబాయి చెరువు అలుగు ఇది. సిర్నాపల్లి గ్రామం నుంచి సుమారు 3 కి.మీ. లోపల అటవీ ప్రాంతంలో నిర్మించిన ఈ చెరువు అలుగు చాలా ఎత్తుగా ఉంటుంది. అలుగు పారినప్పుడల్లా చూడడానికి ఇదో జలపాతంలా మారుతోంది. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి జానకీబాయి చెరువు అలుగు ఇలా మత్తడి దూకుతుండటంతో ఇదిగో ఇలా కనులవిందు చేస్తోంది.
- ఇందల్వాయి, (ఆంధ్రజ్యోతి)