Share News

ఉసురు తీసిన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:15 AM

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో రూ.లక్షలు పోగొట్టుకుని అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉసురు తీసిన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

  • నిర్మల్‌ జిల్లాలో యువకుడి ఆత్మహత్య

సారంగాపూర్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో రూ.లక్షలు పోగొట్టుకుని అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లాలో శనివారం జరిగింది. నిర్మల్‌ మండలం రానాపుర్‌ తండాకు చెందిన జాదవ్‌ ప్రేమ్‌కుమార్‌ (39) ఎరువుల వ్యాపారం చేసేవాడు. కొన్నిరోజుల క్రితం ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో రూ.లక్షలు పోగొట్టుకున్నాడు. దీనికి తోడు వ్యాపారంలో కూడా నష్టం వచ్చింది. దాదాపు రూ.70 లక్షల అప్పులు ఉన్నట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై సారంగాపుర్‌ మండలంలోని చించోలి(బి) గ్రామ సమీపంలో గల మైనార్టీ గురుకుల పాఠశాల వద్ద శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి చేతి మణికట్టు పైన కోసుకున్న గాయాలున్నాయి. ప్రేమ్‌కుమార్‌ తండ్రి తారాసింగ్‌ ఏఎ్‌సఐగా పనిచేస్తున్నారు. అతడికి భార్య అమృత, కుమారుడు రాజా, కుమార్తెలు దీపిక, రోషిణి ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Jan 25 , 2026 | 03:15 AM