నిర్మల్‌లో శివాజీ విగ్రహావిష్కరణకు వెళ్తున్న రాజాసింగ్‌ను అడ్డుకున్న పోలీసులు
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:20 AM
నిర్మల్ జిల్లాలో శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్తుండగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మెదక్ జిల్లా పోలీసులు పెద్దశంకరంపేట దగ్గర అడ్డుకున్నారు.
పెద్దశంకరంపేట, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లాలో శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్తుండగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మెదక్ జిల్లా పోలీసులు పెద్దశంకరంపేట దగ్గర అడ్డుకున్నారు. బాన్సువాడలో శనివారం నాటి ఉద్రిక్త పరిస్థితుల నేపఽథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలియగానే బీజేపీ కార్యకర్తలు, హిందూ సంఘాల నేతలు పోలీ్‌సస్టేషన్‌కు చేరుకున్నారు. రాజాసింగ్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ఎదుట బైఠాయించారు. అనంతరం అంబేడ్కర్ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు రాజాసింగ్‌ను హైదరాబాద్‌కు పంపించారు.