విషమంగానే సౌమ్య ఆరోగ్యం
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:21 AM
నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడిలో తీవ్ర గాయాలతో తమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇప్పటికీ క్లిష్టంగానే ఉందని నిమ్స్ అత్యవసర విభాగాధిపతి డాక్టర్ సునీల్ కుమార్...
హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నిమ్స్
ఎక్సైజ్ జవాన్‌పై గంజాయి ముఠా దాడి
తీవ్ర గాయాలతో నిమ్స్ ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్ సిటీ, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడిలో తీవ్ర గాయాలతో తమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇప్పటికీ క్లిష్టంగానే ఉందని నిమ్స్ అత్యవసర విభాగాధిపతి డాక్టర్ సునీల్ కుమార్, అనస్థీషియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ పద్మజా దుర్గ తెలిపారు. ఆస్పత్రికి తీసుకొచ్చినప్పటి నుంచి ఆమె ఆరోగ్యం మెరుగైందని మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితిని అత్యాధునిక పర్యవేక్షణ వ్యవస్థల సాయంతో అత్యవసర విభాగం, నెఫ్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో, కార్డియాలజీ, యూరాలజీ, కార్డియాక్ థొరాసిస్ సర్జరీ విభాగాలతోపాటు క్రిటికల్ కేర్ టీం నిశితంగా పర్యవేక్షిస్తున్నాయన్నారు. వెంటిలేటర్ మద్దతుపై ఆమెకు వైద్య చికిత్సనందిస్తున్నామని వారు వెల్లడించారు.