Share News

నిమ్స్‌లో మానసిక వికలాంగ బాలుడికి ఆహారనాళం పునర్నిర్మాణం

ABN , Publish Date - May 11 , 2026 | 06:10 AM

నిమ్స్‌ వైద్యులు ఓ మానసిక వికలాంగ బాలుడికి అత్యంత క్లిష్టమైన ఆహారనాళం పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

నిమ్స్‌లో మానసిక వికలాంగ బాలుడికి ఆహారనాళం పునర్నిర్మాణం

హైదరాబాద్‌ సిటీ, మే 10 (ఆంధ్రజ్యోతి): నిమ్స్‌ వైద్యులు ఓ మానసిక వికలాంగ బాలుడికి అత్యంత క్లిష్టమైన ఆహారనాళం పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సాయి ప్రణీత్‌ (13) 2024 డిసెంబరు 4న ప్రమాదవశాత్తు డొమెక్స్‌ క్లీనింగ్‌ పౌడర్‌ తిన్నాడు. దాంతో ఆహారనాళంలో తీవ్రగాయమై పూర్తిగా మూసుకుపోయింది. ఆహారం తీసుకోవడం కష్టమవడంతో కడుపులోకి ‘ఫీడింగ్‌ ట్యూబ్‌’ అమర్చారు. క్లినికల్‌ ప్రోటోకాల్‌ ప్రకారం పునర్నిర్మాణ శస్త్రచికిత్సకు ముందు ఏడాది పాటు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 17న నిమ్స్‌ సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం సీనియర్‌ ప్రొఫెసర్‌ బీరప్ప నేతృత్వంలో వైద్యుల బృందం శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఆరోగ్యశ్రీ పథకం, ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక సహాయంతో రూ.5 లక్షల ఖర్చయ్యే శస్త్రచికిత్సను ఉచితంగా చేశారు. ప్రస్తుతం బాలుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మృదువైన ఆహారం తీసుకోగలుగుతున్నాడని నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప తెలిపారు.

Updated Date - May 11 , 2026 | 06:11 AM