Share News

గాదె ఇన్నయ్యతో సంబంధాలేంటి?

ABN , Publish Date - Apr 23 , 2026 | 05:06 AM

గాదె ఇన్నయ్యతో మీకున్న సంబంధాలేంటి? ఇన్నయ్య సెల్‌ఫోన్‌లో సుమారు 50 వేల మంది కాంటాక్ట్‌ నంబర్లు ఉంటే.. ఆయన మీకే ఎందుకు వాట్సాప్‌లో మావోయిస్టు...

గాదె ఇన్నయ్యతో సంబంధాలేంటి?

  • మాస్‌లైన్‌ నేత పోటు రంగారావును 2 గంటల పాటు విచారించిన ఎన్‌ఐఏ అధికారులు

  • మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పోటు

ఖమ్మం సంక్షేమ విభాగం, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ‘గాదె ఇన్నయ్యతో మీకున్న సంబంధాలేంటి? ఇన్నయ్య సెల్‌ఫోన్‌లో సుమారు 50 వేల మంది కాంటాక్ట్‌ నంబర్లు ఉంటే.. ఆయన మీకే ఎందుకు వాట్సాప్‌లో మావోయిస్టు కరపత్రాలను పంపారు? కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ గురించి మీ అభిప్రాయం ఏంటి?’.. ఇవీ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారుల బృందం మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావును అడిగిన ప్రశ్నలు.. బుధవారం ఖమ్మం వచ్చిన ఎన్‌ఐఏ బృందం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో పోటు రంగారావును సుమారు రెండు గంటల పాటు విచారించింది. ఎన్‌ఐఏ అధికారులు వెళ్లిన తర్వాత పోటు రంగారావు మీడియాతో మాట్లాడారు. తన జన్మస్థలం, కుటుంబ నేపథ్యం, రాజకీయాలకు రావటానికి గల కారణాలతో పాటు పలు విషయాలపై తనను ఎన్‌ఐఏ అధికారులు విచారించారన్నారు. ముఖ్యంగా గాదె ఇన్నయ్యతో ఉన్న సంబంధాలు, మావోయిస్టు కరపత్రాలను తన వాట్సా్‌పకు ఎందుకు పంపారనే అంశాలను అడిగారని చెప్పారు.

Updated Date - Apr 23 , 2026 | 06:33 AM