Share News

అంత్యక్రియల సభలో విప్లవ పిలుపులు

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:33 AM

మావోయిస్టు అగ్రనేత కట్టా రామచంద్రారెడ్డి అంత్యక్రియల సభలో విప్లవం బతకాలే అంటూ నినదించిన గాదే ఇన్నయ్యపై జాతీయ...

అంత్యక్రియల సభలో విప్లవ పిలుపులు

  • గాదే ఇన్నయ్యపై ఎన్‌ఐఏ చార్జీషీట్‌

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు అగ్రనేత కట్టా రామచంద్రారెడ్డి అంత్యక్రియల సభలో విప్లవం బతకాలే అంటూ నినదించిన గాదే ఇన్నయ్యపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గురువారం నాంపల్లి కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేసింది. నిషేధిత మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను ప్రొత్సాహించేలా, ప్రజలను రెచ్చగొట్టేలా గాదే ఇన్నయ్య వ్యవహరించారని చార్జీషీట్‌లో పేర్కొంది. ఇన్నయ్యపై బీఎన్‌ఎ్‌స, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)లోని పలు సెక్షన్ల ప్రకారం ఎన్‌ఐఏ అధికారులు నేరారోపణ చేశారు. రామచంద్రారెడ్డి అంత్యక్రియల సభలో గాదే ఇన్నయ్య ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, విప్లవ పోరాటాలు ఎప్పటికీ ఆగకూడదని పిలుపునిచ్చారని ఆరోపించారు.. ఇన్నయ్య మావోయిస్టు పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని, ఛత్తీ్‌సగఢ్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టు నాయకులను కలిసినట్లు తమకు ఆధారాలు లభించాయని తెలిపారు.

Updated Date - Jun 19 , 2026 | 03:33 AM