Share News

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె ప్రారంభం

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:30 PM

జాతీయ ఆరోగ్య మి షన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల న్యా యమైన డిమాండ్ల సాధన కోసం మంగళవారం జిల్లా కేంద్రంలో సమ్మె ప్రారంభమైంది.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె ప్రారంభం
నిరవధిక సమ్మెలో పాల్గొన్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : జాతీయ ఆరోగ్య మి షన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల న్యా యమైన డిమాండ్ల సాధన కోసం మంగళవారం జిల్లా కేంద్రంలో సమ్మె ప్రారంభమైంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ని ర్వహించిన ఈ ఆందోళనలో రాష్ట్ర, జి ల్లా కమిటీ సభ్యులతో పాటు మహి ళా ఉద్యోగులు, 78 కేడర్లకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ.గౌస్‌పాషా మాట్లాడు తూ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ధీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని నాయకులు ప్ర భుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాం డ్లను తక్షణమే పరిష్కరించి న్యాయం చేయాల ని విజ్ఞప్తి చేవారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని ఐక్యంగా కొనసాగిస్తామని ఆ యన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ ఎం ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ నాయకు డు డాక్టర్‌ బాలకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 11:30 PM