‘మూసీ’పై ఈ దశలో అభ్యంతరాలు సరికాదు
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:55 AM
మూసీ రివర్‌ఫ్రంట్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ కీలక నిర్ణయం వెల్లడించింది.
అనుమతులు వచ్చాక చెప్పొచ్చు
పిటిషన్ కొట్టివేసిన హరిత ట్రైబ్యునల్
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్ర జ్యోతి): మూసీ రివర్‌ఫ్రంట్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ కీలక నిర్ణయం వెల్లడించింది. పర్యావరణ అనుమతులు కొనసాగుతున్న వేళ అభ్యంతరాలు చెప్పడం సరికాదని తెలిపింది. అనుమతి వచ్చిన తరువాత మాత్రమే అభ్యంతరాలు తెలిపాలని పిటిషనర్‌కు సూచించింది. పిటిషన్‌ను అపరిపక్వమైనదిగా పరిగణించిన కేసును మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మూసీ ప్రాజెక్టు పనులపై న్యాయపరమైన ఆటంకాలు తాత్కాలికంగా తొలిగినట్లేనని అధికారులు భావిస్తున్నారు. మూసీ ప్రాజెక్టు ప్రాంతం మృగవాణి నేషనల్ పార్క్‌కు 10 కి.మీ పరిధిలో ఉందని, వరద ప్రాంతం గుర్తింపు జరగలేదని పేర్కొంటూ పి.కార్తిక్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.