Share News

kumaram bheem asifabad- మిన్నంటిన నూతన సంవత్సర సంబరాలు

ABN , Publish Date - Jan 01 , 2026 | 10:15 PM

కేక్‌ కటింగ్‌లు, టపాసుల మోతలు, నృత్యాలతో జిలాల్లో బుధవారం అర్థరాత్రి వరకు నూతన సంవత్సర వేడుకలు మిన్నంటాయి. గురువారం జనమంతా 2025కు వీడ్కోలు చెప్పుతూ 2026 సంవత్సరానికి స్వాగతాన్ని ఘనంగా తెలియజేశారు

kumaram bheem asifabad- మిన్నంటిన నూతన సంవత్సర సంబరాలు
ఆసిఫాబాద్‌లో కలెక్టర్‌ను సన్మానిస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌/వాంకిడి/కెరమెరి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): కేక్‌ కటింగ్‌లు, టపాసుల మోతలు, నృత్యాలతో జిలాల్లో బుధవారం అర్థరాత్రి వరకు నూతన సంవత్సర వేడుకలు మిన్నంటాయి. గురువారం జనమంతా 2025కు వీడ్కోలు చెప్పుతూ 2026 సంవత్సరానికి స్వాగతాన్ని ఘనంగా తెలియజేశారు. మహిళలను ఆలయాలను సందర్శించి అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇళ్ల ముందు మహిళలు, యువతులు హాప్పీ న్యూయర్‌ను తెలిపే రంగురంగుల రంగవల్లులను వేశారు. కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రేను ఎమ్మెల్యే కోవ లక్ష్మి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభకాంక్షలు తెలిపారు. అలాగే జిల్లాలోని అన్ని శాఖల అధికారులు కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ చాంబర్‌లో డీపీఆర్‌వో సంపత్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రింట్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్‌ మీడియా పాత్రికేయులు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టె సంక్షేమ అభివృద్ది పథకాలను అర్హులైన లబ్దిదారులకు అందించడంలో, సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియపరచడంలో మీడియా ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పాత్రికేయులకు డీపీఆర్‌వో ఆధ్వర్యంలో నూతన సంవత్సర డైరీలను అందజేశారు. అనంతరం కలెక్టర్‌ను మీడియా ప్రతినిధులు శాలువాతో ఘనంగా సన్మానించారుఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ, కాగజ్‌నగర్‌ సబ్‌కలెక్టర్‌ శ్రద్ద శుక్లా, ప్రింట్‌ అండ్‌ ఎలక్ర్టానిక్‌ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నితికా పంత్‌ను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం అర్థరాత్రి ఆయా కూడళ్లలో యువకులు కేరింతలు కొడుతూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఎస్పీ నితికా పంత్‌ కేక్‌ కట్‌ చేశారు. గురువారం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు నివాసంలో కాగజ్‌నగర్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సన్మానించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ నివాసంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నివాసానికి పలువురు కార్యకర్తలు, నాయకులు చేరుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వాంకిడి మండలంలో యువవులు కేక్‌లు కట్‌చేసి టపాసులు పేల్చి నూతన సంవత్సర సంబరాలు జరుపుకున్నారు. అర్ధరాత్రి దాటాక బందువులకు, మిత్రులకు, శ్రేయోభిలాశులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు. గురువారం తెల్లవారు జామున మహిళలు ఇళ్లముందు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ముగ్గులు వేశారు. ఎస్సై మహేందర్‌ ఆధ్వర ్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కెరమెరి మండలంలో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయం తమ ఇళ్ల ముందు రంగు రంగు ల ముగ్గులు వేశారు. సమీప ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - Jan 01 , 2026 | 10:15 PM