Share News

kumaram bheem asifabad- డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు కొత్త నిబంధన

ABN , Publish Date - Oct 15 , 2026 | 10:30 PM

శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్స్‌లను పొందడం అంత సులభం కాదు. ఇప్పటి వరకు ఉన్న నిబంధనలకు తోడు త్వరలో మరో కొత్త నిబంధన అమల్లోకి రానున్నట్లు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు వాహనదారులు కొత్తగా లైసెన్సు తీసుకోవాలంటే ముందుగా లెర్నింగ్‌ లైసెన్స్‌ను ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి కంప్యూటర్‌ పరీక్ష రాసి లెర్నింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాలి. లెర్నింగ్‌ లైసెన్స్‌ వచ్చిన నెలరోజుల తర్వాత శాశ్వత లైసెన్స్‌ కోసం ఆన్‌లైన్‌ ఫీజు చెల్లించి రవాణాశాఖ కార్యాలయానికి వచ్చేది. నవంబరు నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది.

kumaram bheem asifabad- డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు కొత్త నిబంధన
లోగో

- రెండున్నర గంటల వీడియో చూస్తేనే జారీకి అవకాశం

వాంకిడి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఇకపై లెర్నిం గ్‌ లైసెన్స్‌, శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్స్‌లను పొందడం అంత సులభం కాదు. ఇప్పటి వరకు ఉన్న నిబంధనలకు తోడు త్వరలో మరో కొత్త నిబంధన అమల్లోకి రానున్నట్లు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు వాహనదారులు కొత్తగా లైసెన్సు తీసుకోవాలంటే ముందుగా లెర్నింగ్‌ లైసెన్స్‌ను ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి కంప్యూటర్‌ పరీక్ష రాసి లెర్నింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాలి. లెర్నింగ్‌ లైసెన్స్‌ వచ్చిన నెలరోజుల తర్వాత శాశ్వత లైసెన్స్‌ కోసం ఆన్‌లైన్‌ ఫీజు చెల్లించి రవాణాశాఖ కార్యాలయానికి వచ్చేది. నవంబరు నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. లెర్నింగ్‌ లైసెన్స్‌ పరీక్ష పాసైన వెంటనే వాహన దారుడి సెల్‌ఫోన్‌కు రవాణాశాఖ ప్రధాన కార్యాల యం నుంచి లింక్‌ వస్తుంది. వాహనదారుడు లెర్నింగ్‌ లైసెన్స్‌ పొందిన తరువాత శాశ్వత లైసెన్స్‌ కోసం వెళ్లేముందు రవాణాశాఖకు సంబంధించిన రెండున్నర గంటల వీడియోను చూడాల్పిందే. లేదంటే లైసెన్స్‌కు అనర్హుడిగా ప్రకటిస్తారు.

- పూర్తిగా చూస్తేనే..

లెర్నింగ్‌ లైసెన్స్‌ పరీక్ష ఉత్తీర్ణులైన వాహనదారులు శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్సు కోసం వచ్చే ముందు విధిగా రెండున్నర గంటల వీడియోను చూడాల్సిందే. వీడి యోను ఆన్‌చేసి అభ్యర్థులకు బదులుగా మరోకరు వీడియోను చేస్తే కుదరదు. వీడియో వీక్షణ పూర్తయితేనే శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్సుకు రుసుమును ఆన్‌లైన్‌లో తీసుకుంటుంది. లేదంటే తీసుకోదు. ముందుగా వాహనదారుడు లెర్నింగ్‌ లైసెన్సు పరీక్ష ఉత్తీర్ణుడైన తర్వాత వచ్చిన లింక్‌ను ఓపెన్‌ చేసి లెర్నింగ్‌ లైసెన్సు నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. వాహనదారుడి పుట్టిన తేదీని నమోదు చేయగానే సెల్‌ఫోన్‌కు ఓటీపీ నంబర్‌ వస్తుంది. ఓటీపీని ఎంటర్‌ చేయగానే లింక్‌ ఓపెన్‌ అవుతుంది. వాహనదారుడి ఫెస్‌ రికగ్నైజేషన్‌ ద్వారా వీడియో ఆన్‌ అవుతుంది. వానాలను ఎలా నడపాలి. .రహదారి భద్రత నియ మాలు, గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, ప్రమా దాల నివారణ ఎలా డ్రైవింగ్‌ చేయాలి? తదితర అంశాలు రెండున్నర గంటల వీడియోలో ఉంటాయి. ఒకవేళ వీడియో ఆన్‌చేసి తలను పక్కకు తిప్పినా వీడియో ఆగిపోతుంది. వీడియోను చూస్తేనే ముం దుకు సాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర రవాణాశాఖ పైలట్‌ ప్రాజెక్టుగా హైదరాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. నవంబరులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది.

Updated Date - Oct 15 , 2026 | 10:30 PM