సర్పంచ్‌లకు కొత్త అధికారాలు
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:54 PM
పల్లెల్లో కొ లువుదీరిన సర్పంచ్‌లకు కొత్త అధికారాలను కట్టబెడు తూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు
-తనిఖీలు, బాగోగుల బాధ్యతలు అప్పగింత
-సర్పంచ్ చైర్మన్‌గా కమిటీల ఏర్పాటు
-ఉత్తర్వులు జారీ చేసిన రేవంత్ సర్కారు
మంచిర్యాల, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో కొ లువుదీరిన సర్పంచ్‌లకు కొత్త అధికారాలను కట్టబెడు తూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తూ, వాటి బాగోగులను పర్యవేక్షించే బాధ్యతలను స ర్పంచ్‌లకు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం సర్పం చ్‌లకు అధికారాలు అప్పగిస్తూ ఇటీవల ఉత్తర్వులు సై తం జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాలను పటిష్టం చే యడం ద్వారా, విద్యార్థులకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అం గన్‌వాడీ కేంద్రాల్లో తరుచుగా ఆరోపణలు రావడం, వి ద్యార్థులకు అందాల్సిన సరుకులు పక్కదారి పట్టిన సం ఘటనలు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయి. పౌష్టికాహా రం పంపిణీలో అక్రమాలకు తావు లేకుండా కేంద్రాల ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గతంలో పర్యవే క్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. అయితే పంచాయ తీ పాలక వర్గాల కాలపరిమితి ముగియడం, దాదాపు రెండేళ్ల పాటు సర్పంచ్‌లు లేకపోవడంతో నిర్వహణ కొం తమేర అదుపు తప్పింది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం కొత్త కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించింది. గ్రామ పంచాయతీల పాలక వర్గాలు కొలువుదీరడంతో నూతన కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
జిల్లాలో 974 సెంటర్లు...
మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, లక్షె ట్టిపేట, బెల్లంపల్లి నాలుగు అంగన్‌వాడీ ప్రాజెక్టుల పరి ధిలో మొత్తం 38 సెక్టార్లు ఉండగా, 974 సెంటర్లు పని చేస్తున్నాయి. మంచిర్యాల ప్రాజెక్టు పరిధిలో 244 కేంద్రా లు ఉండగా, చెన్నూరులో 245, బెల్లంపల్లిలో 282, లక్షె ట్టిపేటలో 203 అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. వాటి పరిధిలో మొత్తం 33,036 మంది విద్యార్థులు, గర్భిణులు 3502 మంది, బాలింతలు 3712 మంది ఉన్నారు. వాటి లో సుమారు 60 శాతం మేర అంగన్‌వాడీ సెంటర్లు పట్టణాల పరిధిలో ఉండగా, 40 శాతం వరకు గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని సెం టర్లు పోను, గ్రామీణ అంగన్‌వాడీ కేంద్రాలను సర్పం చ్‌లు పర్యవేక్షించనున్నారు. వీరందరికీ ప్రతీ నిత్యం సరుకులు సక్రమంగా పంపిణీ చేయాల్సి ఉంది.
కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ...
అంగన్‌వాడీ కేంద్రాలపై ఇకమీదట సర్పంచ్‌ల పర్య వేక్షణ నిరంతరం కొనసాగనుంది. ప్రభుత్వం నుంచి కేం ద్రాలకు సరఫరా అవుతున్న సరుకులు ప్రతీనెలా వచ్చే లా పర్యవేక్షించడంతోపాటు అవి చిన్నారులకు స కాలం లో అందేలా సర్పంచ్‌లు చర్యలు చేపట్టనున్నారు. అలా గే ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు అందించే భోజనం నాణ్యతనూ తనిఖీ చేస్తారు. పిల్లలు, గర్భిణులతోపాటు కేంద్రాలకు వచ్చే వారికి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తారు. ప్ర తీ అంగన్‌వాడీ కేంద్రానికి లక్షల రూపాయల విలువ చే సే సరుకులు నెలనెలా సరఫరా అవుతుండగా, అవి ప క్కదారి పట్టకుండా పకడ్బంధీ చర్యలు చేపడతారు. బా లామృతం, పాలు, గుడ్లు, బియ్యం, కందిపప్పు, తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను లబ్దిదారు లకు అందేలా చూస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నా రుల భద్రత, పరిశుభ్రత, మౌళిక సదుపాయాలు మెరు గుపరచడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఇలా అం గన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసి, లబ్దిదారులకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం చాలా గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సరుకులు లబ్దిదారులకు అందడం లేదనే ఆరోపణలు ఉ న్నాయి. ఇకమీదట అలాంటి చర్యలకు తావులేకుండా ప ర్యవేక్షణ కమిటీలు గుర్తించి, ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేయడం ద్వారా అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. ఇం దుకు నెలకోసారి సమావేశాలు నిర్వహించడంతోపా టు రికార్డులో సంతకాలు చేయాల్సి ఉంటుంది.
సర్పంచ్ చైర్మన్‌గా....
అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చే సే కమిటీలకు చైర్మన్‌గా గ్రామ సర్పంచ్ వ్యవహరిస్తా రు. కమిటీలో మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు. క న్వీనర్‌గా అంగన్‌వాడీ టీచర్, సామాన్య శాస్త్రం బోధించే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, విశ్రాంత ఉద్యోగి ఒకరు, ఏఎన్‌ఎం, చిన్నారుల తల్లులు సభ్యులుగా ఉం టారు. మునిసిపాలిటీల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రా లను మినహాయించి, అన్ని గ్రామ పంచాయతీల పరిధి లోని కేంద్రాలకు సర్పంచ్ చైర్మన్‌గా ఉంటారు.
రాజకీయ పెత్తనంపై వ్యతిరేకత....
అంగన్‌వాడీ కేంద్రాలపై సర్పంచ్‌ల రూపంలో రాజ కీయ పెత్తనం చెలాయించడం పట్ల వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ మేరకు అంగన్‌వాడీ టీచర్లు, సంబంఽధి త సంఘాల నుంచి వ్యతిరేకత వినిపిస్తోంది. అంగన్‌వా డీ కేంద్రాల పర్యవేక్షణ ప్రస్తుతం వివిధ స్థాయి అధికా రుల కనుసన్నల్లో జరుగుతోంది. ఐసీడీఎస్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్‌లు సైతం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికా హారం పంపిణీని ఆన్‌లైన్ విధానంలో చేపడుతున్నారు. వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్స్‌లో నమోదు చేస్తున్నా రు. సరుకుల పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులే కుండా పోషణ్ ట్రాకర్, ఎల్‌హెచ్‌ఏఎస్ యాప్ అందు బాటులోకి వచ్చాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య, అందుతున్న పోషకాహారం, గర్భిణులు, బాలింత లకు పంపిణీ చేస్తున్న పోషకాల వివరాలను నమోదు చేస్తున్నారు. ఇంత పకడ్బంధీ ఏర్పాట్ల మధ్య అంగన్‌వా డీలు కొనసాగుతుండగా, సర్పంచ్‌లకు పర్యవేక్షణ బాధ్య తలు అప్పగించడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.