ఉపాధికి కొత్త హంగులు....
ABN , Publish Date - Mar 08 , 2026 | 11:30 PM
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్)లో సమూల మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారం భించింది. వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి పథకం కొత్త హంగులు దిద్దుకోనుంది.
-వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి
-పేరుతో సహా పలు అంశాల్లో మార్పులు చేసిన కేంద్రం
-త్వరలో పూర్తిస్థాయి విధివిధానాల రూపకల్పన యోచన
-కొత్త ప్రణాళికకు సన్నద్ధమవుతున్న జిల్లా యంత్రాంగం
మంచిర్యాల, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్)లో సమూల మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారం భించింది. వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి పథకం కొత్త హంగులు దిద్దుకోనుంది. పథకం పేరుతో సహా, డైలీ వేజెస్, కూలీల డబ్బులు చెల్లించడం, తదితర మార్పులు చేయ నుంది. దీనిపై ఈ నెలాఖరులోపు పూర్తిస్థాయి విధివిధా నాల రూపకల్పన చేపట్టేందుకు సిద్ధపడుతోంది. పథకానికి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజివిక మి షన్ (వీబీజీరాంజీ) పేరును ఖరారు చేసి, అమలు చేయబో తోంది. దేశవ్యాప్తంగా మార్పులు జరుగుతుండగా, అందుకు అనుగుణంగా పథకాన్ని అమలు చేసేందుకు జిల్లా గ్రామీ ణాభివృద్ధి సంస్థ కూడా సన్నద్ధం అవుతోంది. ఇందులో భా గంగా ఈ నెలాఖరులో జాతీయ స్థాయిలో రాష్ట్ర గ్రామీణా భివృద్ది అధికారులతో ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహిం చి, పూర్తిస్థాయి విధి విధానాలు రూపొందించనున్నారు.
కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో...
కొత్త పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేసేందుకు కేంద్రం ఇప్పటికే అవసరమైన కసరత్తు ప్రారంభించింది. గతంలో పథకానికి అవసరమయ్యే నిధు లు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించగా, ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరించనున్నాయి. ఉ పాధి కూలీలకు ఇప్పటి వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి కూలీ డబ్బులు చెల్లిస్తుండగా, ఇకమీదట వారాంతంలో సొ మ్ము అందజేసే విధంగా మార్పులు చేపట్టనున్నారు. అలా గే ఇప్పటిదాకా కుటుంబానికి 100 రోజులు గ్యారంటీగా పని కల్పిస్తుండగా, ఇప్పుడు 125 రోజులు పని కల్పించనున్నారు. ఇందులో భాగంగా జాబ్ కార్డు కలిగి ఉన్న లబ్దిదారులకు ఈకేవైసీ యాప్‌లో ఆధార్, బ్యాంకు ఖాతాను అనుసంధా నం చేశారు. ఉపాధి హామీ కూలీల వేలి ముద్రలు, కళ్ల ను ఐరిష్ ద్వారా ఇప్పటికే సేకరించి, వివరాలు యాప్‌లో నమో దు చేశారు. ఈ ప్రక్రియ అంతా జిల్లాలో దాదాపుగా పూ ర్తయింది. పథకంలో భాగంగా ఇకమీదట ఉపాధి హామీ పనులు చేసే కూలీల ఐరిష్ ఆధారంగా బయోమెట్రిక్ హాజ రు నమోదుతో పాటు పని ముగిసిన తరువాత కూలీలతో తీసిన గ్రూప్ ఫొటో యాప్‌లో ఆప్‌లోడ్ చేయనున్నారు. త ద్వారా బోగస్ హాజరును నిర్మూలించనున్నారు. ఇప్పటి వ రకు డైలీ వేజెస్ కింద కూలీలకు రూ. 307 చెల్లిస్తుండగా, కొత్త పథకంలో ప్రస్తుతానికి వేతనం విషయంలో ఎలాంటి మార్పులు చేపట్టలేదు.
జిల్లాలో లక్షా పై చిలుకు జాబ్ కార్డులు....
ఉపాధి హామీ పథకం కింది జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం కూలీలు 2,27,837 మంది ఉండగా, ఇప్పటి వరకు 1,17,554 జాబ్ కార్డులు జారీ చేశారు. ఆర్థిక సంవత్సరంలో మొత్తం 53,292 కు టుంబాలకు పనులు కల్పించగా 81,354 మంది కూలీలకు ఉపాధి కల్పించారు. ఈ ఏడాది జాబ్ కార్డు కలిగిన లబ్దిదా రులకు 21 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పె ట్టుకోగా ఇప్పటి వరకు 18.40 లక్షల పని దినాలు పూర్త య్యాయి. పథకంలో భాగంగా నిర్ణీత వంద రోజుల పని దినాలను 456 కుటుంబాలు పూర్తి చేశాయి. ఆర్థిక సంవ త్సరం ఈ నెలాఖరుతో ముగియనుండగా, ఇప్పటి వరకు 87 శాతం లక్ష్యం చేరింది. పథకంలో పనులు చేసిన కూలీ లకు జనవరి రెండవ తేదీ వరకు ఖర్చు చేసిన మొత్తం రూ. 47.40 కోట్లుగా ఉంది. అలాగే పనులు చేపట్టేందుకు కూలీలకు అవసరమైన సామాగ్రి కొనుగోలు చేసేందుకు మరో రూ. 8.60 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబు తున్నారు. కొత్త పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేం దుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.