కేంద్ర ఉద్యోగులకు సరికొత్త జీవిత బీమా
ABN , Publish Date - Apr 24 , 2026 | 03:54 AM
కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్రంలోని వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వోద్యోగులకు ఆర్థిక భద్రత, బ్యాంకింగ్ సౌకర్యాలను అందించేందుకు...
వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్రంలోని వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వోద్యోగులకు ఆర్థిక భద్రత, బ్యాంకింగ్ సౌకర్యాలను అందించేందుకు... ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్’ పేరిట కొత్త పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దీని ద్వారా ఇన్సూరెన్స్ ేసవలు, బ్యాంకుల ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు అందుతాయని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జీరో బ్యాలెన్స్ వేతన ఖాతా సౌకర్యం, ఉచితంగా ఆర్టీజీఎస్, యూపీఐ, నెఫ్ట్ ద్వారా చెుల్లింపులు, తక్కువ వడ్డీ రేట్లకే గృహ, విద్య, వాహన, వ్యక్తిగత రుణ సౌకర్యం, లోన్ ప్రాసెసింగ్‌లలో అదనపు చార్జీలపై మినహాయింపు, రూ.1.5 కోట్ల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. విమాన ప్రమాదాలు జరిగితే రూ.2 కోట్ల వరకు బీమా, ప్రమాదాల్లో శాశ్వత, పాక్షిక వైకల్యం కలిగితే రూ.1.5 కోట్ల వరకు బీమా, రూ.20 లక్షల వరకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుందని అన్నారు. కుటుంబం మొత్తానికి సమగ్ర ఆరోగ్య బీమా సౌకర్యం ఉంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు.