అనుక్షణం ఈసీజీ 24 గంటలూ గుండె లయను నమోదు చేసే సరికొత్త ఉపకరణం
ABN , Publish Date - Sep 19 , 2026 | 05:47 AM
గుండె లయ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈసీజీ తీస్తారనే విషయం తెలిసిందే! లేదా 24 గంటలూ పర్యవేక్షించాలంటే హోల్టర్ మానిటరింగ్ పరీక్ష చేస్తారు. అలా ఎప్పుడో ఒకసారి సమస్య వచ్చినప్పుడు కాకుండా.. గుండె పనితీరును అనుక్షణం పర్యవేక్షించగలిగితే?.. అలా ఉపయోగపడే సరికొత్త ఉపకరణాన్ని తాము త్వరలోనే భారత్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెక్ రిపబ్లిక్‌కుచెందిన ‘కార్డి ఏఐ’ అనే హెల్త్-టెక్ సంస్థ వెల్లడించింది.
అభివృద్ధి చేసిన చెక్ రిపబ్లిక్ సంస్థ
‘కార్డి ఏఐ’.. 26న భారత్‌లో విడుదల
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గుండె లయ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈసీజీ తీస్తారనే విషయం తెలిసిందే! లేదా 24 గంటలూ పర్యవేక్షించాలంటే హోల్టర్ మానిటరింగ్ పరీక్ష చేస్తారు. అలా ఎప్పుడో ఒకసారి సమస్య వచ్చినప్పుడు కాకుండా.. గుండె పనితీరును అనుక్షణం పర్యవేక్షించగలిగితే?.. అలా ఉపయోగపడే సరికొత్త ఉపకరణాన్ని తాము త్వరలోనే భారత్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెక్ రిపబ్లిక్‌కుచెందిన ‘కార్డి ఏఐ’ అనే హెల్త్-టెక్ సంస్థ వెల్లడించింది. భారత్‌లో ఈ ఉపకరణాన్ని ‘యురేసియా మెడికల్ టెక్నాలజీస్ ఎల్‌ఎల్‌పీ’ పంపిణీ చేయనుంది. శుక్రవారం ఇక్కడ రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ భవనంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆ సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ డాక్టర్ రమణ జాగర్లమూడి, యురేసియా మెడికల్ టెక్నాలజీస్ ఎల్‌ఎల్‌పీ కోఫౌండర్ డాక్టర్ రాఘవేంద్రరావు ఆ ఉపకరణం గురించి వివరాలు తెలిపారు. స్ట్రాప్ రూపంలోని ఈ ఉపకరణాన్ని ఛాతీపై ధరిస్తే అది ప్రతి సెకనూ గుండె లయను నమోదు చేస్తుందని వెల్లడించారు. వచ్చే శనివారం(26వ తేదీన) ఈ ఉపకరణాన్ని భారతీయ మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేయబోతున్నట్టు డాక్టర్ రమణ చెప్పారు.