కొత్త కోర్సులొచ్చేశాయ్..
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:05 AM
డిగ్రీ, పీజీ, బీఎస్సీ ఆనర్స్‌లో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. మారుతున్న పరిశ్రమ అవసరాలు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా వీటికి రూపకల్పన చేశారు.
డిగ్రీలో 19, పీజీలో 11, బీఎస్సీ ఆనర్స్‌లో 4
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి
ప్రకటించిన ఉన్నత విద్యా మండలి
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): డిగ్రీ, పీజీ, బీఎస్సీ ఆనర్స్‌లో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. మారుతున్న పరిశ్రమ అవసరాలు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా వీటికి రూపకల్పన చేశారు. 2026-27 విద్యా సంవత్సరంలో అమల్లోకి వచ్చే ఈ కోర్సుల వివరాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటించింది. బీఎస్సీలో 9, బీబీఏలో 5, బీకాంలో 3, బీఏలో 2, ఎంఏలో 6, ఎమ్మెస్సీలో 4, ఎంకామ్‌లో ఒకటి, బీఎస్సీ ఆనర్స్ నాలుగేళ్ల కోర్సులోనూ కొత్తగా 4 కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కోర్సుల కరపత్రికను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఉపాధ్యక్షులు ఆచార్య ఈ పురుషోత్తం, ఎస్‌కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటే్‌షలతో కలిసి ఆవిష్కరించారు. డిగ్రీ పూర్తైన వెంటనే ఉద్యోగం లభించాలన్న లక్ష్యంతో ఈ కోర్సులను రూపకల్పన చేశామని బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు.
ఇవీ కొత్త కోర్సులు..
బీఏ (డిఫెన్స్, సెక్యూరిటీ స్టడీస్), బీఏ (ల్యాండ్, అగ్రికల్చర్, రూరల్ డెవల్‌పమెంట్), బీబీఏ (హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్, హెల్త్ మేనేజ్‌మెంట్), బీబీఏ (ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌లైన్, ఎయిర్‌స్పేస్, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్), బీబీఏ (మారిటైమ్ టెక్నాలజీ, కామర్స్ మేనేజ్‌మెంట్), బీబీఏ (ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సెక్యూరిటీ, మేనేజ్‌మెంట్), బీబీఏ (ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్), బీకాం (ఫైనాన్స్ టెక్నాలజీ), బీకామ్ (ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్), బీకామ్ (ఈ-కామర్స్, ఎం-కామర్స్, డిజిటల్ మార్కెటింగ్), బీఎస్సీ (మల్టీమీడియా అండ్ యానిమేషన్), బీఎస్సీ (డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), బీఎస్సీ (క్లైమెట్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్), బీఎస్సీ ఆనర్స్ (ఇన్‌స్ర్టుమెంటేషన్), బీఎస్సీ ఆనర్స్ (ఇన్ఫర్మటిక్స్), బీఎస్సీ ఆనర్స్ (బయో మెడికల్ సైన్సెస్), బీఎస్సీ ఆనర్స్ (మెడికల్ మైక్రోబయాలజీ), బీఎస్సీ (జెనెటిక్స్, న్యూట్రీషన్, ఫుడ్ సైన్స్), బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ, ఎంఎల్, రోబోటిక్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్), ఎంఏ (ఆడ్వాన్స్ డిఫెన్స్, సెక్యూరిటీ స్టడీస్), ఎంఏ (ల్యాండ్ గవర్నెన్స్, అగ్రికల్చర్ రూరల్ డెవల్‌పమెంట్), ఎంఏ (అడ్వాన్స్ హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్, హెల్త్ మేనేజ్‌మెంట్), ఎంఏ (మారిటైమ్ టెక్నాలజీ, మారిటైమ్ గవర్నెన్స్), ఎంఏ (ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్), ఎంఏ (అడ్వాన్స్ ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌లైన్, ఎయిర్‌స్పేస్, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్), ఎంకామ్ (ఫైనాన్స్ టెక్నాలజీ, ఎమర్జింగ్ చాలెంజెస్), ఎమ్మెస్సీ (క్లైమెట్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్), ఎమ్మెస్సీ (మెడికల్ మైక్రో బయాలజీ), ఎమ్మెస్సీ (మెడికల్ ఇమ్యునాలజీ), ఎమ్మెస్సీ (సైబర్ సెక్యూరిటీ).